పెళ్లి కాని వాళ్లు ఈ స్వామిని దర్శిస్తే .. వెంటనే పెళ్లి అవుతుందటా..! ఎక్కడంటే

(G.Venkatesh, News 18, Ananthapur)

అనంతపురం(Ananthapur)జిల్లాలోని ఆత్మకూరు మండలంలో గల పంపనూరు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (Subrahmanyeshwar Swamy)దేవస్థానం ఎంతో మహిమ కలదని భక్తులు నమ్ముతారు. ఈ దేవస్థానం అనంతపురం నగరముకు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల(Sri Krishna Devaraya)కాలంలో దాదాపు 500 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంతేకాక ఋషులు, యోగులు ఇక్కడ తపస్సు చేసే వారిని, దాని ఫలితంగా ఈ ప్రాంతానికి తపోవనం అని పేరు కూడా కలదని చరిత్ర చెబుతోంది.

పేషెంట్‌కి గర్భసంచి తీశారు..సర్జికల్ క్లాత్ పెట్టి కుట్లు వేశారు..తర్వాత ఏమైందో తెలుసా..?

తపోవనాన్ని దర్శిస్తే పెళ్లి ఖాయం..

ఈ దేవస్థానం కు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని, కోరికలను కోరుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఆదివారం ఇక్కడ దీపాలు వెలిగించడం, యాగాలు చేయడం, మరియు పూజలు చేయడం చేస్తూ ఉంటారు. పెళ్లి కాని యువతలు, యువకులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి గర్భగుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఇక్కడ ప్రజల గట్టి నమ్మకం.

108ప్రదక్షిణలు చేస్తే కల్యాణ యోగమే..

అలాగే ఈ దేవస్థానానికి యువకులు ఎక్కువగా వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. మరియు పెళ్లి అయిన వారు సంతానం కలగాలని వారు ఈ దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఉన్న యాగశాలలో సంతాన ప్రాప్తి కోసం యాగం చేస్తూ ఉంటారు. ఇలా ఏడు వారాలు లలో ప్రతి ఆదివారం యాగాలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇక్కడ సంతాన ప్రాప్తి కోసం మరియు పెళ్లి కావాలనే వారు ఇక్కడ చెట్టుకి ముడుపులు కూడా కడుతూ ఉంటారు.

మగవాళ్లకు మాత్రమే..

దేవస్థానం లోపల కొబ్బరికాయ కొట్టడానికి అనుమతి ఇవ్వరు, బయట దేవస్థానానికి ఎదురుగా బావి పక్కన కొబ్బరికాయ కొట్టేలా ఏర్పాటు చేశారు. ఇలా ఈ దేవస్థానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లేవారు ఎంతో నిష్టతో, భక్తితో వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వారి కోరికలు నెరవేర్చుకునేలా పూజలు చేస్తూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *