రాజమౌళి రికార్డ్స్‌‌కు దగ్గరగా వస్తాం.. మహేష్, త్రివిక్రమ్ సినిమా రేంజ్‌పై నిర్మాత కామెంట్స్

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న SSMB28 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల, సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రాన్ని తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ, నాగ వంశీ (Naga Vamshi) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) నిర్మించిన తాజా చిత్రం సార్ (SIR). ఫిబ్రవరి 17న విడువల కానుండగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ.. మహేష్ బాబు SSMB28 మూవీ రేంజ్ గురించి మాట్లాడారు.

SSMB28 మూవీ ద్వారా అన్ని రీజన్లతో రాజమౌళి రికార్డులకు దగ్గరగా వస్తారని నాగవంశీ చెప్పారు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఇంచు మించు ఆ రేంజ్‌కు వెళ్లామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫుటేజీలను చూశానని, త్రివిక్రమ్ ప్రెజెంటేషన్ గురించి తనకు ఒక ఆలోచన ఉందని, ఈ సినిమా అద్భుతాలు చేస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. అభిమానులను అస్సలు నిరాశపరచదని, గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. కాగా.. నాగ వంశీకి నిర్మాత ఎస్ రాధాకృష్ణ (చిన బాబు) బాబాయ్ అని తెలిసిందే.

ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంతో తెరకెక్కిన ‘సార్‌’ మూవీ అవుట్‌పుట్‌తో తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు నాగ వంశీ తెలిపారు. ఈ సినిమా చిత్రీకరించిన, తెరపై ప్రజెంట్ చేసిన విధానం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనుకునే ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇది కనెక్ట్ అవుతుందని చెప్పారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌కు ‘సార్’ మూవీ తమిళ్‌లో మొదటి చిత్రం కాగా.. పర్ఫెక్ట్ డోస్ ఎమోషన్‌తో కూడుకున్నదని, విస్తృత వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే ఎలిమెంట్స్ అన్నీ పక్కాగా కుదిరాయన్నారు.

ఇదే ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు చెప్పుకొచ్చిన నాగ వంశీ.. త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో పౌరాణిక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇది పాన్-వరల్డ్ కాన్వాస్‌ను కలిగి ఉంటుందని, త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెప్పారు.

గతేడాది సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో హిట్ కొట్టిన నాగ వంశీ.. ఇటీవలే అర్జున్ దాస్ లీడ్ రోల్‌లో ‘బుట్టు బొమ్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ కూడా లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *