రెండో మ్యాచ్‌కు ఇండియా విమెన్స్ టీమ్ రెడీ కేప్ టౌన్: పాకిస్తాన్‌పై నెగ్గి జోష్ మీదున్న ఇండియా విమెన్స్ టీమ్.. టీ20 వరల్డ్‌కప్‌లో రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. బుధవారం జరిగే గ్రూప్–బి సెకండ్ లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సెమీస్ అవకాశాలు బాగా మెరుగయ్యే చాన్స్ ఉండటంతో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. వేలి గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా ఈ పోరుకు అందుబాటులోకి రావొచ్చు. అప్పుడు యస్తికా భాటియా బెంచ్‌కు పరిమితం కావొచ్చు. మిగతా లైనప్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. బ్యాటింగ్‌లో షెఫాలీ, జెమీమా, రిచా ఘోష్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశమే అయినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నది.
పాక్‌తో మ్యాచ్‌లో చిన్న టార్గెట్ కావడంతో లోయర్ ఆర్డర్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. అయితే హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, పూజా కూడా బ్యాట్లు ఝుళిపిస్తే భారీ టార్గెట్ నిర్దేశించొచ్చు. విండీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఎక్కువగా బౌలింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లో ఫెయిలైన రేణుకా, రాజేశ్వరి గాడిలో పడాలి. స్పిన్నర్ రాధా యాదవ్ స్పిన్ మ్యాజిక్ ఇండియాకు ప్లస్ కానుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఇండియా కాస్త మెరుగుపడాలి.
గెలుపు లక్ష్యంగా..
మరోవైపు తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ బోణీ కోసం ఆరాటపడుతోంది. అయితే ప్రస్తుతం కరీబియన్ల రికార్డు ఏమాత్రం బాగాలేదు. గత 14 మ్యాచ్‌ల్లో ఏ ఒక్కదాంట్లోనూ గెలవలేదు. బ్యాటింగ్‌లో కెప్టెన్ హీలీ మాథ్యూస్‌పైనే ఎక్కువగా ఆధారపడటం మైనస్‌గా మారింది. క్యాంప్‌బెల్ ఫామ్‌లో ఉన్నా.. మిగతా బ్యాటర్లు అంచనాలను అందుకోవడం లేదు.
©️ VIL Media Pvt Ltd.