వన్‌ప్లస్ మానిటర్ E24, X27 విక్రయాలు ప్రారంభం.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

చైనీస్ టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్‌(OnePlus) స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) సెగ్మెంట్‌లోనే కాకుండా ఇతర విభాగాల్లోనే ఆకట్టుకుంటోంది. ఎక్కువగా ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ కస్టమర్లపై దృష్టిసారిస్తూ హై-ఎండ్ రేంజ్‌లో ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తుంది. ఇటీవల రెండు కొత్త మానిటర్లను బడ్జెట్, మిండ్ రేంజ్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ మానిటర్ E24, మానిటర్ X27 పేరుతో వీటిని తీసుకొచ్చింది. నేటి(బుధవారం) నుంచి వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. మరి ఈ మానిటర్స్ ధరలు, స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

* ధరలు

వన్‌ప్లస్ మానిటర్ E24ను కంపెనీ బడ్జెట్ రేంజ్‌లో తీసుకొచ్చింది. దీని ధర రూ.11,999. ఇక వన్‌ప్లస్ మానిటర్ X27 మిడ్ రేంజ్‌లో లాంచ్ అయింది. దీని ధర రూ.27,999. ఈ రెండు మానిటర్స్ OnePlus.in, వన్ ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ , వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ మేజర్ బ్యాంక్ లావాదేవీల్లో నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందుబాటులో ఉంది.

* స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ మానిటర్ E24 ఫుల్ HD డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇందులో 16.7 మిలియన్ లైఫ్- లైక్ కలర్స్, విస్తృతమైన 178-డిగ్రీ IPS ప్యానెల్‌ ఉంటుంది. లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ విజువల్స్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ ఫీచర్ కూడా ఈ మానిటర్‌లో ఉంటుంది. వన్‌ప్లస్ మానిటర్ E24 స్లీక్ 8mm మినిమలిస్ట్ డిజైన్‌తో లభిస్తుంది. దీనికి మెటల్ స్టాండ్‌ ఉంటుంది.

ఇది కూడా చదవండి : CBSE విద్యార్ధులకు అలర్ట్.. ChatGPT టెక్నాలజీ డివైజ్ లపై నిషేధం..

ఇది మూడు-వైపుల బేజల్-లెస్ డిజైన్, అడ్జస్ట్ చేయడానికి స్టాండ్ యాంగిల్‌ ఉంటుంది. డెస్క్‌ వద్ద గందరగోళంగా ఉండకుండా ఈ మానిటర్‌లో బిల్ట్- ఇన్ కేబుల్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను కూడా ఉంటుంది. ఈ మానిటర్‌కు USB టైప్-సి కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. మల్టిపుల్ మోడ్‌లతో కస్టమైజ్డ్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్, సీమ్‌లెస్ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

* OnePlus Monitor X27

ఈ మానిటర్ 68.5cms స్క్రీన్ సైజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఫాస్ట్,‌ స్మూత్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. వేగంగా 1ms రెస్‌పాన్స్ అందిస్తుంది. మినిమల్ లాగ్స్, బ్లర్స్‌తో అల్ట్రా-క్లియర్ ఇమేజ్‌లను అందిస్తోంది. AMD ఫ్రీసింక్ ప్రీమియంతో OnePlus Monitor X27 గేమ్‌కు తగినట్లుగా స్క్రీన్ మారుతుంది. స్మూత్ విజువల్స్‌తో ప్రొఫెషనల్-స్థాయి గేమింగ్‌ను ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు.

ఇష్టమైన గేమ్‌లను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి, కంటెంట్‌‌ను స్ట్రీమ్ చేయడానికి షార్ప్ 2K QHD విజువల్ రిజల్యూషన్‌‌ను అందిస్తుంది. ఈ మానిటర్ బ్రైట్ 178-డిగ్రీ IPS ప్యానెల్‌తో అన్ని కోణాల్లో అత్యుత్తమ వ్యూవింగ్ అందిస్తుంది. బ్రైట్ డిస్‌ప్లే HDR 400 కలర్‌తో అద్భుతమైన వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ మానిటర్ స్ట్రీమ్‌లైన్డ్ త్రీ-సైడ్ బెజెల్-లెస్ డిజైన్‌‌‌కు సపోర్ట్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *