వీడెవడ్రా బాబూ.. రూ.12 కోట్ల లాటరీ తగిలితే.. భార్యకు చెప్పకుండా, మాజీ భార్యకు ఫ్లాట్ కొన్న

జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో.. వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కథ చైనాది. ఇందులో మహానుభావుడు (ఇంటిపేరు ఝౌ)… 10 మిలియన్ యువాన్ల (రూ.12.13 కోట్లు) లాటరీ గెలిచాడు. ఇతనికి ఇప్పుడు మెయిన్‌లాండ్ కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. ఇతని మొదటి భార్యకు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలన్నది కోర్టు ఆదేశం. ఎందుకు చెల్లించాలంటే.. లాటరీ తగిలిన విషయాన్ని భార్య దగ్గర దాచిపెట్టినందుకు.

లాటరీ తగిలితే మొత్తం అమౌంట్ చేతికి రాదు. పన్నుల రూపంలో కొంత పోతుంది. ఈ కేసులో ఝౌకి 8.43 మిలియన్ యువాన్లు (రూ.10.22 కోట్లు) దక్కాయి. కానీ ఝౌ.. ఈ విషయాన్ని తన భార్య (ఇంటిపేరు లిన్)కి చెప్పకూడదు అనుకున్నాడు.

పైజ్ మనీ అతని బ్యాంక్ అకౌంట్‌లోకి డిపాజిట్ అవ్వగానే.. ఝౌ… 2 మిలియన్ యువాన్ల (రూ.2.42 కోట్లు)ను తన పెద్ద అక్కకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత 7 లక్షల యువాన్ల (రూ.84.93 లక్షలు)ను తన మాజీ భార్యకు ఇచ్చేందుకు విత్‌డ్రా చేశాడు. ఆమె ఓ ఫ్లాట్ కొనే ప్రయత్నాల్లో ఉంది.

ఎలా తెలిసిందో గానీ.. మాజీ భార్య వ్యవహారం ప్రస్తుత భార్యకు తెలిసింది. అగ్గి మీద గుగ్గిలమైంది. నీ మొహానికి ఆ పచ్చడి మొహంది కావాల్సి వచ్చిందా… నీ సంగతి తేలుస్తా అంటూ.. విడాకులకు అప్లై చేసింది. ఆస్తిపాస్తులన్నీ సమానంగా విభజించి… ఓ సగం తనకు ఇవ్వాలని కోర్టులో కోరింది. అంతేకాదు… ఝౌ తన అక్కకు, రెండో భార్యకు ఇచ్చిన డబ్బులో.. మూడో వంతును తనకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి : వామ్మో ఏటీఎంలో అలా చేసిందేంటీ.. పోలీసులే షాక్ అయ్యారుగా!

తూర్పు చైనాలోని వెంఝౌ కోర్టు ఈ కేసులో కీలక విషయాన్ని కనిపెట్టింది. అదేంటంటే… ఝౌ… లాటరీ టికెట్ కొనేందుకు ఉపయోగించిన డబ్బు అతనొక్కడిదే కాదు. ఆ డబ్బులో సగ భాగం అతని భార్యదీ ఉంది. అంటే.. రూల్ ప్రకారం గెలిచిన లాటరీ డబ్బుపై హక్కు ఇద్దరికీ సమానంగా ఉంటుంది. కానీ ఝౌ.. ఈ విషయాన్ని దాచిపెట్టాడు. ఝౌ చేసింది తప్పు కాబట్టి… అతను గెలిచిన అమౌంట్‌లో 60 శాతాన్ని ప్రస్తుత భార్యకు ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుపై పైకోర్టుకు వెళ్లేందుకు ఇద్దరిలో ఎవరూ సిద్ధపడలేదని తెలుస్తోంది.

Posted in UncategorizedTagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *