వైరల్ అవుతోన్న శ్రీదేవి ఫోటోలు

వైరల్ అవుతోన్న శ్రీదేవి ఫోటోలు హీరో ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించినప్పటికీ శ్రీదేవి అనగానే  ఈశ్వర్ సినిమానే గుర్తుకు వస్తుంది. 1992లో రిక్షా మామ అనే తమిళ చిత్రంతో శ్రీదేవి సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాల నటిగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగులోకి ఆరంగేట్రం చేసింది. ఈ మూవీతో ఆమెకు తమిళంలో కంటే తెలుగులోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. ఆ తర్వాత వరుసగా నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆదిలక్ష్మీ, పెళ్లికాని ప్రసాద్ సినిమాల్లో నటించారు. కొన్నాళ్లకు రాహుల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి రూపిక అనే పాప పుట్టింది. ఇక శ్రీదేవి చివరిగా రవితేజ నటించిన వీర చిత్రంలో హీరోకి చెల్లెలి పాత్రలో కనిపించారు. సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. బుల్లితెరపై రియాల్టీ షోల్లో జడ్జిగా రాణిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన లెటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *