These 3 signs have immense wealth due to Kendra Trikona Raj Yoga 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం… ప్రతి గ్రహం తన రాశి చక్ర గుర్తులను ఎప్పటికప్పుడు మార్చడమే కాకుండా ఇతర గ్రహాలతో మైత్రిని ఏర్పరుస్థాయి. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు బృహస్పతి అస్తమిస్తుంది, అదే సమయంలో దూరంగా ఉన్నప్పుడు బృహస్పతి ఉదయిస్తుంది. బృహస్పతి ఒక సంవత్సరంలో తన రాశి చక్రాలను మారుస్తుంది. 2023వ సంవత్సరంలో ఏప్రిల్ 22న బృహస్పతి మీన రాశిని వదిలి మేష రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనికి ముందు బృహస్పతి ఏప్రిల్ 1న అస్తమిస్తుంది, ఏప్రిల్ 29న మేష రాశిలో ఉదయిస్తుంది. బృహస్పతి ఉదయించినపుడు ‘కేంద్రం త్రికోణ రాజయోగంను సృష్టిస్తుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మిథున రాశి:
గురు ఉత్థానం నుంచి ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం.. మిథున రాశి వారికి చాలా అనుకూల ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది. కొత్త జాబ్ ఆఫర్ మీకు రావచ్చు. ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు జరుగుతాయి. పాత పెట్టుబడి లాభిస్తుంది. జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి గురువు ఉత్థానం నుంచి ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు చాలా డబ్బు ఇస్తాడు. ఎక్కడి నుండైనా హఠాత్తుగా డబ్బు వస్తుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అనేక మార్గాల నుంచి ఆదాయం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కర్కాటక రాశి:
గురుగ్రహ ఉత్థానం వల్ల ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం కర్కాటక రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. నిలిచిపోయిన పని పూర్తి అవుతుంది. అన్ని పనుల్లో విజయం ఉంటుంది. వృత్తి-వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణం వలన మంచి లాభం ఉంటుంది. ఈ రాశి వారికీ విదేశాల్లో చదవాలనే కోరిక నెరవేరుతుంది.
Also Read: Best Jio Recharge Plan 2023: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 365 కాదు 388 రోజుల వ్యాలిడిటీ! అదనంగా 87 జీబీ డేటా
Also Read: Flipkart iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. రూ. 46999 వేలకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు! ఏమాత్రం ఆలస్యం చేయొద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.