Mushroom Business: లక్ష రూపాయల పెట్టుబడితో నెలకు పది లక్షలు సంపాదించే అద్భుతమైన సులభమైన వ్యాపారం

తక్కువ ఇన్వెస్ట్, తక్కువ రిస్క్‌తో అధిక ప్రయోజనాలు పొందే అవకాశాలున్న వ్యాపారాలు చాలానే ఉన్నాయి. ఏది సరైందనేది తెలుసుకోగలగాలి. ఇప్పుుడు మీకు చెప్పబోయే బిజినెస్‌లో పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. లాభాలు మాత్రం అధికమే. నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. పెట్టుబడి 1 లక్ష రూపాయలు పెడితే చాలు. 

పది రెట్లు లాభం ఆర్జించే అవకాశం

మష్రూం అంటే పుట్ట గొడుగుల పెంపకం మంచి లాభసాటి వ్యాపారంగా ఉంది ప్రస్తుతం. ఇందులో లాభం ఏకంగా పదిరెట్లు ఉంటుంది. అంటే 1 లక్ష రూపాయలు పెట్టుబడితో 10 లక్షల వరకూ ఆర్జించవచ్చు. గత కొద్దికాలంగా పుట్టుగొడుగులకు డిమాండ్ బాగా పెరిగింది. పుట్ట గొడుగుల పెంపకం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం..

ఇటీవలి కాలంలో పుట్ట గొడుగులకు డిమాండ్ అధికంగా ఉంది. పార్టీలు, రెస్టారెంట్లలో ఎక్కువగా కన్పిస్తోంది. దీనికోసం గోధుమలు లేదా ధాన్యం గడ్డిని కొన్ని రకాల కెమికల్స్‌తో కలిపి కంపోస్ట్ తయారు చేసుకోవాలి. కంపోస్ట్ ఎరువు తయారయ్యేందుకు ఓ నెల రోజులు సమయం పడుతుంది. ఆ తరువాత ఏదైనా ఉపరితలంపై 6-8 ఇంచెస్ షీట్ పరిచి..మష్రూం విత్తనాలు వేయాలి. విత్తనాలను కంపోస్ట్ ఎరువుతో కప్పేయాలి. 40-50 రోజుల్లో మష్రూం లేదా పుట్ట గొడుగులు సిద్ధమౌతాయి. మష్రూం పెంపకం కోసం షెడ్ వంటి ఏర్పాటు అవసరం. 

మష్రూం సాగును 1 లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభిస్తే మంచి లాభాలుంటాయి. ఒక కిలో మష్రూం ఉత్పత్తికి 25-30 రూపాయలు ఖర్చవుతుంది. మార్కెట్‌లో కిలో పుట్టగొడుగులు 250-300 వరకూ అమ్ముతున్నారు. పెద్ద పెద్ద హోటల్స్ లేదా రెస్టారెంట్లలో మంచి క్వాలిటీ మష్రూం సరఫరా చేస్తే కిలోకు 500 రూపాయలు కూడా లభించవచ్చు.

Also read: OLD Pension Scheme: పెన్షన్ విదానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అప్‌డేట్, ప్రత్యామ్నాయమార్గంపై కసరత్తు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *