Paytm lite: యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చిన పేటీఎం బ్యాంక్ చిన్న చిన్న లావాదేవీలను సింగిల్ క్లిక్‌తో పూర్తి చేసే వీలుండేలా పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తోంది. దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) తీసుకొచ్చిన యూపీఐ లైట్ ఫీచర్‌ని వాడనుంది. ఈ ఫీచర్‌ని ప్రారంభించిన తొలి బ్యాంక్ తమదేనని పేటీఎం ప్రకటించింది. ఈ ఫీచర్ ఎలావాడాలంటే.. మొదట యూపీఐ లైట్ వ్యాలెట్‌లో రూ.2వేల వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మరో రెండు రోజుల్లో రూ.2వేలు యాడ్ చేసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న లావాదేవీలకోసం వాడుకోవచ్చు. అయితే, చాలామంది డిజిటల్ ట్రాన్‌సాక్షన్స్‌లో రూ.200లోపే చేస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా రూ.200 వరకు ట్రాన్‌సాక్షన్స్ సింగిల్ క్లిక్‌తో చేయొచ్చని పేటీఎం తెలిపింది. దీనివల్ల బ్యాంకుల డెయిలీ ట్రాన్‌సాక్షన్ లిమిట్ అయిపోకుండా ఉంటుంది. ఈ యూపీఐ లైట్ ట్రాన్‌సాక్షన్స్ అన్నీ పేమెంట్ బ్యాలెన్స్, హిస్టరీల్లో తప్ప బ్యాంక్ పాస్‌బుక్‌లో కనిపించవని పేటీఎం తెలిపింది.
©️ VIL Media Pvt Ltd.