చైనాకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల భద్రతకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్‌కు(Vibrant Village Programme) కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమానికి రూ.4800 కోట్లు కేటాయించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబడుతుందని కేంద్రమంత్రి తెలియజేశారు. ఇందుకోసం రూ.4800 కోట్ల కేటాయింపు జరిగిందని, ఇందులో రోడ్ల నిర్మాణానికి రూ.2500 కోట్లు వెచ్చించనున్నారు.
దేశం యొక్క ఉత్తర సరిహద్దు యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఠాకూర్ అన్నారు. దీనితో ఈ సరిహద్దు గ్రామాలలో భరోసా జీవనోపాధిని అందించవచ్చని చెప్పారు. ఇది వలసలను ఆపడానికి సహాయపడుతుందని… దీంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కూడా పటిష్టం చేయనున్నారు.
అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ కార్యక్రమం నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జీవనోపాధి అవకాశాలు మరియు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది ఉత్తర సరిహద్దు ప్రాంతంలో సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించంతోపాటు ఇక్కడ నివసించే ప్రజలకు నాణ్యమైన అవకాశాలను అందిస్తుంది.
Amit Shah: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో వచ్చిన మార్పులు ఇవే… వివరించిన హోంమంత్రి అమిత్ షా
Amit Shah: అదానీ వివాదంపై స్పందించిన అమిత్ షా.. దేనికీ భయపడాల్సిన పని లేదు
దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మరియు అట్టడుగు స్థాయికి చేరేలా చేయడానికి రాబోయే 5 సంవత్సరాలలో 2 లక్షల మల్టీపర్పస్ పిఎసిఎస్, డెయిరీ, ఫిష్ కోఆపరేటివ్‌లను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.