రైళ్ల విషయంలో అప్పటికీ, ఇప్పటికీ మారనిది ఏదైనా ఉందంటే, పట్టాల మధ్య కనిపించే కంకర రాళ్లు. ఒకప్పుడు బొగ్గుతో రైళ్లు నడిచేవి. ఇప్పుడు విద్యుత్తుతో నడుస్తున్నాయి. పాతకాలం నాటి రైళ్ల నుంచి ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్ల వరకు టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ ఇప్పటికీ రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు అలాగే కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్‌పై (Railway Track) చిన్న చిన్న గులకరాళ్లు కనిపించడం చాలా సాధారణం. ఏ ఊళ్లో రైల్వే ట్రాక్ చూసినా ఈ రాళ్లను గమనిస్తుంటాం. కానీ అసలు రైలు పట్టాల మధ్య ఈ రాళ్లు ఎందుకు ఉంటాయన్న సందేహం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. దీని వెనుక ఓ సైన్స్ ఉంది.
రైల్వే ట్రాక్‌ల మధ్య, వాటికి ఇరువైపులా గులకరాళ్లు ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు. రైలు పట్టాల వీటిని చూడొచ్చు. రైలు ఎంత బరువు ఉంటుందో మనందరికీ తెలుసు. భారీ కంపార్ట్‌మెంట్లతో పెద్దగా ఉన్న రైలు, పట్టాలపై వెళ్తుంటే భారీ కంపనాలు వస్తుంటాయి. పెద్ద శబ్దంతో పాటు సమీపంలోని నిర్మాణాలు, భవనాలకు ముప్పుగా ఉంటుంది. ఆ ముప్పు తొలగించడానికే ఈ పదునైన రాళ్లను ఉపయోగిస్తారు. ప్రకంపనల్ని ఈ రాళ్లు తగ్గిస్తాయి.
LIC Policy: ఎల్ఐసీ పాలసీతో లోన్… ఈ రూల్స్ తెలుసా?
ఇదొక్కటే కారణం కాదు. మరో కారణం కూడా ఉంది. రైలు పట్టాలపై మొక్కలు, చెట్లు పెరగకుండా కంకర నిరోధిస్తుంది. ఇక వర్షాకాలంలో రైలు పట్టాలపై నీళ్లు నిలిచిపోకుండా ఉండటానికి కారణం ఈ కంకరే. పట్టాలపైకి వచ్చే వర్షపు నీరు ఈ కంకర నుంచి కిందకు వెళ్లి సమీపంలోని కాలువలో లేదా డ్రైనేజీ కలిసిపోతుంది. కాబట్టి పట్టాలపై నీరు నిలిచిపోయి, కింద ఉన్న భూమి అయ్యే అవకాశం ఉండదు.
Vande Bharat Express: ఆ పని చేయొద్దు ప్లీజ్… దక్షిణ మధ్య రైల్వే రిక్వెస్ట్
ఈ చిన్న రాళ్లే కాకుండా రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్‌తో చేసిన పొడవాటి ప్లేట్‌లు కూడా ఉంటాయి. ఆ ప్లేట్లపైనే ట్రాక్‌లు వేస్తారు. వీటిని స్లీపర్స్ అంటారు. ట్రాక్ బ్యాలస్ట్‌లు కూడా ఈ స్లీపర్‌లకు స్థిరత్వాన్ని అందిస్తాయి. రైలు ప్రయాణిస్తున్నప్పుడు, స్లీపర్, బ్యాలస్ట్ కలయిక దాని బరువును మాత్రమే భరించి, ప్రమాదం సంభవించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇలా ట్రాక్‌ల మధ్యలో ఉన్న కంకర రాళ్లు రైలు సాఫీగా ముందుకు సాగడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.