ఈనెల 23న ’మార్టిన్’ టీజర్ రిలీజ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న కన్నడ ఇండస్ట్రీ నుండి మరో బిగ్ బడ్జెట్ మూవీ వస్తోంది. అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా ‘మార్టిన్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఎ.పి.అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ సాగా క్యాప్షన్‌తో ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 23న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో భారీ మెషీన్ గన్‌తో, ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు ధృవ సర్జా. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘కేజీఎఫ్’ పేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఉదయ్ మెహతా నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది.
©️ VIL Media Pvt Ltd.