ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. నిబంధనల ప్రకారం హాజరు కలిగి ఉన్న విద్యార్థులందరికీ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అందించాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ కు స్పష్టం చేసింది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఏ కాలేజీ/యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు తమని సంప్రదించాలని బోర్డు సూచించింది. 1800 425 7635 టోల్ ఫ్రీ నంబర్ ను అన్ని పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించింది.
ఏపీలోని ఇంటర్ కాలేజీలకు బోర్డు హెచ్చరిక.. ఈ నంబర్ కు ఫిర్యాదు చేయాలని స్టూడెంట్స్ కు సూచన
