ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం.. 12 మందికి తీవ్ర గాయాలు

Yadadri District: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ ప్రైవేట్ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టింది. మహిళలంతా ఓ పచ్చళ్ల కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అందించారు. కూలీలందరూ దేవాలమ్మ నాగారం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *