Tata Group: రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా టాటాలే అన్న చందంగా మారింది పరిస్థితి. ఇటీవల అతిపెద్ద డీల్‌తో ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్‌కు చెందిన దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా.. పెద్ద ఎత్తున విమానాలను కొనుగోలు చేసింది. ఇది ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ నుంచి 250 విమానాలు కాగా.. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి మరో 220 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా రూ. 6 లక్షల కోట్లకుపైగా ఉండటం గమనార్హం. ఇదే రికార్డు అంటే ఇప్పుడు మరో రికార్డుపై కన్నేసింది. దాదాపు ఇది కూడా ఖరారైనట్లే.
ఎయిరిండియా తన విమాన కొనుగోలు డీల్‌ను మరింత పొడగించినట్లు తెలుస్తోంది. తాము మరో 370 జెట్లను కొనే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు, ఇది తమ ప్రతిపాదనల్లోనే ఉందని చెప్పుకొచ్చారు ఎయిరిండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్. ఈ మేరకు లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. గతేడాది ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసింది టాటా గ్రూప్. అప్పుడే ఇంజిన్ల నిర్వహణ కోసం CFM ఇంటర్నేషనల్, రోల్స్ రాయిస్, GE ఏరోస్పేస్‌తో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమైన సమయంలోనే తాము ఈ డీల్ దిశగా ఆలోచించినట్లు నిపుణ్ చెప్పారు.
97936660
97916935
ఇక ఇప్పుడు టాటా గ్రూప్ చేసే.. 840 ఎయిర్‌క్రాఫ్ట్స్ డీల్ అతిపెద్దది. అంతకుముందు 460 విమానాల కొనుగోలు మాత్రమే రికార్డులో ఉంది. 2011లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు టాటా గ్రూప్ తొలుత 470 విమానాల డీల్ కుదుర్చుకోగా.. మరో 370 విమానాలను దశాబ్ద కాలంలో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌బస్ నుంచి మొత్తం 210.. A-320/321 Neo/XLR, 40 A350-900/1000 విమానాలు కాగా.. బోయింగ్ నుంచి 190.. 737-Max, 20 787s, 10 777s విమానాలు ఉన్నాయి.
ఇక ఇటీవల వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రదాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సమయంలో ఎయిరిండియా కేవలం మరో ఎయిర్ లైన్ మాత్రమే కాదని, ఇది.. కోట్లాది భారతీయుల ఆశలు, కలల్ని మోసే సాధనంగా పేర్కొన్నారు. భారత్‌కు వచ్చే 15 సంవత్సరాల్లో సుమారు 2 వేల విమానాలు అవసరమవుతాయని అన్నారు మోదీ.
97437782
97684002
Read Latest
Business News and Telugu News