టీ20 వరల్డ్ కప్‌లో విండీస్‌పై భారత మహిళల జట్టు విక్టరీ

టీ20 వరల్డ్ కప్‌లో విండీస్‌పై భారత మహిళల జట్టు విక్టరీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా రెండో విజయాన్ని సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. 119 పరుగుల  టార్గెట్‌ను టీమిండియా 18.1 ఓవర్లలోనే  ఛేధించింది. 

దీప్తి అదుర్స్..

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులే చేసింది. విండీస్ ప్లేయర్లలో టేలర్ 40 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేయగా… క్యాంబెల్ 36 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు సాధించింది. చివర్లో నేషన్ 21  రన్స్ చేసి నాఔట్గా నిలిచింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా..,పూజా వస్ట్రాకర్, రేణుకా సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. 

చెలరేగిన ఘోష్..

ఆ తర్వాత 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.1 ఓవర్లలో 4  వికెట్లు నష్టపోయి ఛేదించింది. రిచా ఘోష్ 32 బంతుల్లో 44 పరుగులతో  నాటౌట్ నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 42 బంతుల్లో 3 ఫోర్లతో 33 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 28 పరుగులతో పర్వాలేదనిపించింది. విండీస్ బౌలర్లలో రామ్ హరాక్ 2 వికెట్లు తీసింది. చిన్నెల్లి హెన్రీ, మాథ్యూస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 

దీప్తి వంద వికెట్లు..

ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయడంతో టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. పూనమ్ యాదవ్ 99 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. అంతేకాదు మెన్స్ , ఉమెన్స్  జట్టులో అంతర్జాతీయ టి20ల్లో లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. పురుషుల జట్టులో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా చహల్ 91 వికెట్లతో కొనసాగుతున్నాడు. 

  ©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *