తెలంగాణ మాజీ చీఫ్ సెక్రట్రీ, సీనియర్ ఐఏఎస్(IAS) అధికారి సోమేశ్‌కుమార్ (Somesh kumar)స్వచ్ఛంద పదవీ విరమణ చేసిటన్లుగా తెలుస్తోంది. గతంలో తెలంగాణ సీఎస్(cs)గా బాధ్యతలు నిర్వహించిన సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాలని తెలంగాణ హైకోర్టు(High court) గత నెలలో ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారి జనవరి 12న ఏపీ కేడర్‌లో రిపోర్ట్ చేశారు. ఏపీ సీఎం జగన్(Jagan)ను కూడా కలిశారు. ఈ పరిణామాలు జరిగి సుమారు నెల రోజులు గడిచినప్పటికి ఏపీ ప్రభుత్వం సోమేశ్‌కుమార్ కు పోస్ట్ కేటాయించలేదు. ఈనేపధ్యంలోనే ఆయన స్వచ్చందంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోమేశ్‌కుమార్ వాలంట్రీ రిటైర్‌మెంట్ దరఖాస్తును కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆమోదించినట్లుగా తెలుస్తోంది.
Success Story: లక్షల జీతం ఇచ్చే జాబ్ వదులుకొని..తేనె ఉత్పత్తి రంగంలో దూసుకెళ్తున్న యువతి
సీనియర్ ఐఏఎస్ కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ మాజీ చీఫ్ సెక్రట్రీ సోమేశ్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ క్యాడర్‌కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి స్వచ్చంద పదవీ విరమణ చేసినట్లుగా సమాచారం అందుతోంది. గత నెలలో ఏపీ అధికారిగా బదిలీ చేయబడ్డ సోమేశ్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్ట్ కేటాయించలేదు. ఈనేపధ్యంలోనే ఆయన వాలంటీర్ రిటైర్‌మెంట్ తీసుకునేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. అందుకోసం సీఎం వైఎస్ జగన్‌కు దరఖాస్తు చేసుకోవడం, దాన్ని ఆమోదించడం జరిగింది.
స్వచ్చంద పదవీ విరమణ..
గతంలో తెలంగాణ సీఎస్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నతమైన బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌కుమార్ ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా ఇటీవలే తెలంగాణ హైకోర్టు తెలిపింది. అందుకే ఆయన్ని ఏపీకి వెళ్లాలంటూ ఆదేశించడంతో సోమేశ్‌కుమార్‌ని సీఎస్‌గా తొలగిస్తూ ఆయన స్థానంలో రత్నకుమారి అనే ఐఏఎస్ అధికారిణికి బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కారు. ఏపీకి బదిలీ కాబడిన సోమేశ్‌కుమార్ జనవరి 12న ఏపీ క్యాడర్‌లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం కావడంతో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ స్వచ్చందంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీ సీఎంకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఆమోదించినట్లుగా కూడా తెలుస్తోంది.