నా బాయ్‌ఫ్రెండ్‌ నన్ను దూరం పెడుతున్నాడు.. మా ఇద్దరి మధ్య గొడవలు కూడా లేవు..!

నాకు పెళ్లి కాలేదు. రెండేళ్లుగా ఓ అబ్బాయితో డేటింగ్‌లో ఉన్నాను. మా ఇద్దరి రిలేషన్‌ బాగానే ఉంది. అయితే కొన్ని రోజులుగా అతను నాతో వింతగా ప్రవర్తిస్తున్నాడు. మా ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవలు కూడా జరగలేదు. అయినా, నన్ను అవైడ్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. అతనికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. మూడు వారాలుగా నాతో మాట్లాడట్లేదు, నాకు కాల్‌ చేయట్లేదు, మెసేజ్‌ కూడా లేదు. నిజం చెప్పాలంటే.. నన్ను పట్టించుకోవట్లేదు. కారణం ఏమిటో నాకు తెలియదు? నాకు చాలా బాధగా ఉంది.

రిలేషన్ షిప్ కౌన్సెలర్ రచన అవత్రామణి (Relationship counselor Rachna Avatramani in Mumbai) మాట్లాడుతూ, ఈ సమయంలో మీరు ఎంత ఒంటరిగా ఫీల్‌ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అయితే మీరు గివ్‌ అప్‌ ఇవ్వాలిన అవసరం లేదు. మీ రిలేషన్‌ బాగున్నప్పటికీ.. మీ బాయ్‌ఫ్రెండ్‌ మీతో మాట్లాడం మానేశారని అన్నారు. అతని ప్రవర్తనలో చాలా విచిత్రమైన వైఖరిని చూశారని చెప్పారు. మీ మనస్సులో ఎన్నో రకాల ప్రశ్నలు ఉండి ఉంటాయి, నేను బాగా అర్థం చేసుకోగలను. మీ ఇద్దరికీ ఎవరనైనా కామన్‌ ఫ్రెండ్స్‌ ఉంటే.. వాళ్లతో మాట్లాడండి. వాళ్ల సలహా తీసుకోండి. మీ బాయ్‌ఫ్రెండ్ , ఆతని ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి. ఏవైనా సమస్యల్లో ఉన్నాడేమో అడిగి తెలుసుకోండి.

మీరు ఇద్దరూ గత రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పారు. మీతో మీరు కొంత సమయంల గడపాలని నేను మీకు సూచిస్తారు. ఈ రిలేషన్‌లో మీరు ఏమి కోరుకుంటున్నారా క్లారిటీకి రండి. మీ బాయ్‌ఫ్రెండ్‌ మిమ్మల్ని నెగ్లెక్ట్‌ చేస్తున్నారని మీరు అనుకుంటే, మీతో విడిపోవాలని అనుకుంటున్నాడని మీకు కచ్చితంగా అర్థం అయితే.. ఇక ఆలోచించకుండా.. బ్రేక్‌ అప్‌కు మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. ఎందుకంటే మీతో రిలేషన్‌లో ఉండమని ఎవర్నీ ఫోర్స్‌ చేయలేం. అదే సమయంలో, మీ భవిష్యత్ జీవితాన్ని మీరు ఎవరితో గడపాలనుకుంటున్నారో కూడా శ్రద్ధ వహించండి. మీరు దీన్ని అర్థం చేసుకుంటే, మీ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది.

విడిపోవడానికి ఖచ్చితమైన కారణం తెలుసుకోవాలని మీకు అనిపిస్తే, ఒకసారి మీరు బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడండి. సడెన్‌గా ఆతనిలో మార్పు రావడానికి కారణం ఏమిటో అడిగి తెలుసుకోండి. ఈ కారణం, తెలుసుకుంటే.. మీ ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని అతని అర్థమయ్యేలా చెప్పడానికీ వీలుంటుంది. దీని వల్ల మీ రిలేషన్‌ చెడిపోదు, మీకు బ్రేక్‌ అప్‌ అయిన తర్వాత కూడా.. మీ మనస్సులో ఏమీ ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *