నెం.1 ఆల్ రౌండర్ జడేజా, నెం.2 బౌలర్ అశ్విన్

నెం.1 ఆల్ రౌండర్ జడేజా, నెం.2 బౌలర్ అశ్విన్ నాగ్ పూర్ టెస్టులో బౌలింగ్లో రాణించిన రవిచంద్రన్ అశ్విన్..ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో  అదరగొట్టాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీసుకున్న అశ్విన్..రెండో స్థానంలో నిలిచాడు. అటు ఈ టెస్టులో ఏడు వికెట్లు తీసుకున్న జడేజా..ఆల్ రౌండర్ల జాబితాలో 424 రేటింగ్ పాయింట్లు సాధించి నెంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. బౌలర్ల జాబితాలో పాట్ కమ్మిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఆరు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకులో నిలిచాడు. 

తొలి టెస్టులో అద్బుత సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌ శర్మ పదో స్థానం నుంచి ఎనిమిదికి చేరుకున్నాడు. మొదటి టెస్టులో విఫలమైన డేవిడ్‌ వార్నర్‌ 20వ ర్యాంకులో నిలిచాడు. ఖవాజా 2 ర్యాంకులు తగ్గి 10 వ ప్లేస్ లో ఉన్నాడు.

టీ20ల్లో వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో  సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టి20లో  ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో హార్దిక్ పాండ్యా  రెండో స్థానానికి చేరుకున్నాడు. వన్డేల్లో సిరాజ్ నంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు. వన్డే బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో శుబ్ మన్ గిల్ (6), విరాట్ కోహ్లీ (7), రోహిత్ శర్మ (9) టాప్ 10లో స్థానం దక్కించుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *