Gold Rates Today: భారతీయులకు బంగారం అంటే ఇష్టమనే విషయం తెలిసిందే. ఎక్కువగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, వేడుకలు, పండగల సమయాల్లో భారత మహిళలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు మన దేశంలో రెండేళ్ల గరిష్టం దాటి ట్రేడయ్యాయన్న విషయం తెలిసిందే. ఇక.. అంతర్జాతీయంగా పలు అంశాలు దీనికి దోహదం చేశాయి. ఇటీవల ఆర్థిక మాంద్యం భయాలు పెరిగిన నేపథ్యంలో.. బంగారం ధరలు పెరిగాయి. గోల్డ్ రేట్లు ఎక్కువగా అమెరికా పరిస్థితులను బట్టి మారుతుంటాయి. కొద్దిరోజుల కిందటి వరకు అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదైంది. దీంతో మాంద్యం భయాలు ముంచుకొచ్చాయి. బంగారం రేట్లు పెరిగాయి.
ప్రస్తుతం మాత్రం అమెరికాలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం, రిటైల్ సేల్స్ బలమైన వృద్ధి నమోదు చేయడంతో.. అక్కడ ఆర్థిక మాంద్యం భయాలు తొలగిపోతున్నాయి. 2023 జనవరిలో రిటైల్ సేల్స్ అంచనాలకు మించి రెండేళ్లలోనే గరిష్టాన్ని నమోదుచేశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఔన్సుకు త్వరలో 1800 డాలర్ల దిగువకు చేరే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక దేశీయ మార్కెట్లో మాత్రం 10 గ్రాముల బంగారం ధర రూ.55 వేల వరకు చేరొచ్చని తెలుస్తోంది. త్వరలో మరింత తగ్గనున్నట్లు చెబుతున్నారు.
97818740
97812475
అమెరికాలో రిటైల్ సేల్స్ డేటా బలమైన వృద్ధి నమోదు చేసిన నేపథ్యంలోనే.. అమెరికా కరెన్సీ డాలర్ కూడా 6 వారాల గరిష్టానికి చేరింది. ఇది డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగేందుకు కారణమవుతోంది. అదే సమయంలో.. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు పడిపోతుంటాయి. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే.. గోల్డ్ రేట్లు మరింత తగ్గుతాయి. ఇక బంగారం ధరలు పడిపోతుండటం ఇన్వెస్టర్లకు లాభించే విషయమని, వారు మరింత కొనుగోళ్లు ఎక్కువ జరుపుతారని అంచనా వేస్తున్నారు నిపుణులు.
ఇక అంతర్జాతీయంగా ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1838 డాలర్ల వద్ద ఉండగా.. స్పాట్ సిల్వర్ రేటు 21.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.82.698 వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశీయంగా గోల్డ్ రేట్ల విషయానికి వస్తే గనుక ప్రస్తుతం భాగ్యనగరంలో (హైదరాబాద్) 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్లకు రూ.400 పడిపోయి రూ.52 వేల మార్కు వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పడిపోయి.. తులానికి రూ.56,730 వద్ద ఉంది. దిల్లీలో కూడా బంగారం ధర 22 క్యారెట్లకు తులానికి రూ.400, 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.430 పడిపోయింది. మరోవైపు వెండి రేట్లు కూడా పడిపోయాయి.
97501038
Read Latest
Business News and Telugu News