పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. IT Returns ఏప్రిల్ 1 నుంచే.. మీరు సిద్ధమేనా?

IT Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ప్రతి ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. అందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ Central Board of Direct Taxes) కొంత సమయం ఇస్తుంటుంది. ఈ సారి తొందరగానే ఆదాయపు పన్ను రిటర్నులకు అవకాశం కల్పిస్తోంది ఐటీ శాఖ. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన ఐటీ రిటర్నులను ఏప్రిల్ 1 నుంచే సమర్పించేందుకు అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక ఏడాది తొలి రోజు నుంచే సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంటాయని సీబీడీటీ వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ఆదాయపు పన్ను చెల్లింపుదారులు సిద్ధమవటం మంచిది. త్వరగా ఐటీ రిటర్నులు (Income Tax Return Forms) దాఖలు చేయడం ద్వారా ఐటీ చిక్కుల నుంచి తప్పించుకోవడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించిన ఐటీఆర్ ఫామ్స్ ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-6 వరకు ఫిబ్రవరి 10నే నోటీఫై చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. ఐటీఆర్-7 ఫామ్‌ను ఫిబ్రవరి 14, 2023 రోజున ప్రభుత్వం నోటీఫై చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఐటీఆర్ ఫారాల్లో ఎలాంటి మేజర్ మార్పులు లేవని పేర్కొంది. అయితే, గతంతో పోలిస్తే రెండు నెలల ముందే ఐటీ- రిటర్నుల ఫారాలను నోటీఫై చేయడం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వం ఐటీఆర్ ఫామ్స్‌ని ఆర్థిక ఏడాది చివర్లో లేదా కొత్త ఆర్థిక ఏడాది తొలి నాళ్లలో నోటిఫై చేస్తుంటుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు (అకౌంట్లకు ఆడిట్ అవసరం లేని వారు) ఐటీఆర్ ఫామ్స్ దాఖలు చేసేందుకు జులై 31, 2023 చివరి తేదీగా గుర్తుంచుకోవాలి.

97836786

వ్యక్తులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, సంస్థలు దాఖలు చేయాల్సిన 1-6 ఐటీఆర్ ఫారాలను సీబీడీటీ ఇప్పటికే నోటిఫై చేసింది. అసెస్‌మెంట్ ఇయర్ ప్రారంభం నుంచే రిటర్నులు దాఖలు చేయడం వల్ల ట్యాక్స్ పేయర్స్‌కి మంచి ప్రయోజనం చేకూరుతుందని సీబీడీటీ పేర్కొంది. సాధారణంగా జులై 31 వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు సమయం ఉంటుంది. కొన్ని అనివార్య సందర్భాల్లో ఈ గడువును పొడిగిస్తుంటుంది సీబీడీటీ.

ఐటీఆర్-1 ఫామ్ ఫైల్ చేసే వారి అర్హతలో ఎలాంటి మార్పులు చేయలేదు సీబీడీటీ. సహజ్‌గా పిలిచే ఈ ఐటీఆర్-1 ఫారమ్ రూ.50 లక్షల లోపు ఆదాయం ఉన్న రెసిడెండ్ వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. అయితే, వారి ఆదాయ మార్గాలు జీతం, ఇంటి ద్వారా వచ్చే ఆదాయం, వడ్డీలు, డివిడెండ్లపై వచ్చే ఆదాయాలు మాత్రమే ఉండాలి. వ్యవసాయం ద్వారా రూ.5 వేల వరకు ఆదాయం అనుమతిస్తారు. అయితే, కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారు లేదా అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లు కలిగి ఉన్న వారు ఈ ఐటీఆర్-1 దాఖలు చేసేందుకు అనర్హులు.

97856935

97941713

97865327

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *