పుట్టిన తేదీ నంబర్‌ 1నుంచి 9 వరకు రిలేషన్‌ అద్భుతంగా ఉంటుంది..8 నంబర్ వాళ్లకు కష్టమే

Numerology:పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్‌ల కలయిక కుదరదు. ఇలాంటి అనుకూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వివాహ సంబంధాలు, వ్యాపార ఒప్పందాల వంటి పనుల్లో న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ల మధ్య అనుకూలత చూసుకోవాలని చెబుతున్నారు. 1వ నంబర్‌కి అధిపతి సూర్యుడు. ఈ అంకె నంబర్‌ 8, నంబర్‌ 9తో ఎంత అనుకూలంగా ఉంటుంది, వీటి కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

(ప్రతీకాత్మకచిత్రం)

నంబర్ 8:

జ్యోతిష్యం, న్యూమరాలజీ పుస్తకాలలో అత్యంత పాపులర్‌ అంకెల కలయిక గురించి మాట్లాడటం చాలా సులభం. కానీ హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. అవును నంబర్‌ 1, నంబర్‌ 8 గురించి మాట్లాడుతున్నాం. అంటే సూర్యుడు, శని గ్రహం గురించి చర్చిస్తున్నాం. సూర్యుడు శని గ్రహానికి తండ్రి. తండ్రి, కొడుకు దీర్ఘకాలంలో చక్కగా కలిసి ఉండటం సాధ్యం కాదని చెబుతారు. పుట్టిన సంఖ్య 1, విధి సంఖ్య 8 ఉన్న వ్యక్తులు ఈ కలయికలో అత్యంత కష్టమైన భాగాన్ని ఎదుర్కొంటారు. ఎల్లప్పుడూ జీవిత మార్గంలో వ్యక్తిత్వ ఘర్షణను చూస్తారు. రిలేషన్‌లో ఉన్న వ్యక్తులు మిస్‌ కమ్యూనికేషన్‌తో సమస్యలు ఎదుర్కొంటారు. దృఢత్వం, ఆరోగ్య సమస్యలు, ఆధిపత్యం, ఆర్థిక సవాళ్లతో బాధపడే అవకాశం ఉంది. అటువంటి అంకెలకు సంబంధించిన వ్యక్తుల మధ్య వ్యాపార భాగస్వామ్యం ఉంటే.. శివుడు, శని, సూర్య భగవానుడికి పూజలు చేయాలి. అదే విధంగా ఇల్లు లేదా ప్లాటు నంబర్‌లోని అంకెల మొత్తం 8 రాకుండా చూసుకోవాలి. లేకపోతే ఎంత కష్టపడి పని చేసినా నెమ్మదిగా అభివృద్ధి చెందుతారు.

(ప్రతీకాత్మకచిత్రం)

నంబర్‌ 9:

నంబర్‌ 1, 9 మధ్య రిలేషన్‌ అసాధారణమైనది. ఇది సూర్యుడు, అంగారక గ్రహాల మధ్య సామరస్యపూర్వక సంబంధం. ఇది కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. ఈ వ్యక్తులు ఉత్తమ అవగాహన, కమ్యూనికేషన్, విధేయత, ఆర్థిక లాభాలు, సామాజిక గౌరవం వంటి వాటిని ఆనందిస్తారు. రెండు సంఖ్యలకు చెందిన వ్యక్తులు క్రియేటివ్‌, ఇంటెలిజెంట్‌, మెంటల్లీ అలెర్ట్, కమ్యూనికేషన్‌లో బెస్ట్‌, ఎక్స్‌ప్రెసివ్‌, ట్యాలెంటెడ్‌గా ఉంటారు. 1వ అంకె, 9వ అంకె రెండూ ఇతరుల పని, నైపుణ్యాన్ని గౌరవిస్తాయి. జీవిత భాగస్వామిగా, వారు తమ జీవిత భాగస్వామి విజయానికి దోహదం చేస్తారు, ఆదర్శవంతమైన జంటగా ఉంటారు. వ్యాపార భాగస్వాములు, ప్రత్యేకంగా సృజనాత్మక రంగానికి చెందిన వారు కలిసి అద్భుతాలు చేయగలరు. శ్రేయస్సు, విలాసం కోసం వారు చేయవలసిందల్లా వారి కుడి చేతి మణికట్టు చుట్టూ ఎర్రటి దారాన్ని కట్టుకోవాలి.

(ప్రతీకాత్మకచిత్రం)

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *