పేరుకేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. 3 నెలలుగా ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్ లేదు

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : వరంగల్

వరంగల్ కేంద్రంలోని కాకతీయ మెడికల్ సూపర్ స్పెషాలిటీ, ఎంజీఎం ఆసుపత్రుల్లో ఎమ్మారై స్కానింగ్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ప్రతిరోజు 3 వేలకు పైగా ఓపి రోగులు, 300 వరకు అత్యవసర రోగులు వస్తుంటారు. అదే సమయంలో కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ శని, ఆదివారాలు తప్ప మిగిలిన రోజుల్లో ప్రతిరోజు 300 వస్తుంటారు 20 నుండి 30 మంది వరకు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు. ఎక్కువగా న్యూరో సర్జరీ, న్యూరాలజీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో వస్తుంటారు.

న్యూరో సర్జరీ సంబంధిత రోగులకు ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం కాగా.. ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలైన వారు, వెన్నుపూసకు సంబంధించిన సర్జరీలతో చికిత్స అందించడానికి ముందు రోగ నిర్ధారణ కోసం వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవాలని సూచిస్తారు. అయితే, ప్రస్తుతం ఆస్పత్రిలో అది అందుబాటులో లేకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది.అంతకు ముందున్న ఎంఆర్ఐ స్కానింగ్  మెషీన్ పాతదై చెడిపోగా.. అప్పటి నుండి వస్తుందనే అధికారులు చెప్తున్నారు.. తప్ప మెషీన్  మాత్రం ఇప్పటి వరకు ఆస్పత్రికి రాలేదు.

సుమారు మూడు నెలల క్రితం వరకు ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం బాగానే పనిచేసేది. అయితే, అది పాతది కావడంతో తరచూ రిపేర్లు వచ్చేది. స్కానింగ్ లో ఇమేజింగ్ క్యాప్చర్ చేసేందుకు ఉపయోగించే ట్యాబు దెబ్బతినగా.. మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అవుతుండడంతో పక్కన పడేసి కొత్త యంత్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా కొత్త యంత్రం మంజూరుకు ముందుకొచ్చింది. అయితే, మూడు నెలల క్రితమే వస్తుందని ఎంజీఎం అధికారులు చెప్పినా ఇప్పటికీ రాలేదు. ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో కొత్త యంత్రం ఏర్పాటుకు తగ్గట్లు నిర్మాణ మార్పులు అయితే చేశారు. సుమారు 14 లక్షల రూపాయల విలువగల ఈ యంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంపిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే, రోజూ ఈ ఆసుపత్రులకు వచ్చే రోగులు మాత్రం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లాల్సి రావడంతో భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *