మరో మూడు రోజుల్లో శివరాత్రి (Shivaratri) పర్వదినం జరుపుకోవడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. శివరాత్రి రోజు శివాలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం లాంటి శైవ క్షేత్రాల్లో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మీరు కూడా ఈ శివరాత్రికి శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? తెలంగాణ టూరిజం (Telangana Tourism) ఈ శైవ క్షేత్రాలకు టూర్ ప్యాకేజీలు ఆపరేట్ చేస్తోంది. వేర్వేరు టూర్ ప్యాకేజీలు అందుబటులో ఉన్నాయి. మరి ఏ టూర్ ప్యాకేజీ ధర ఎంత? టూర్ ఎలా సాగుతుంది? తెలుసుకోండి.
Telangana Tourism Srisailam Tour: తెలంగాణ టూరిజం ఏసీ బస్సులో శ్రీశైలం టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఇది రెండు రోజుల టూర్ ప్యాకేజీ. మొదటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే నేరుగా సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం ఉంటుంది. రెండో రోజు రోప్ వే ద్వారా పాతాళ గంగ, పాలధార, పంచధార, శిఖరం, డ్యామ్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.2400. పిల్లలకు రూ.1920.
Govt Scheme: 65 ఏళ్లు దాటినవారికి గుడ్ న్యూస్… ఆ స్కీమ్‌లో చేరే ఛాన్స్
Telangana Tourism Kaleshwaram Tour: తెలంగాణ టూరిజం కాళేశ్వరం ఒక రోజు టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. తెల్లవారుజామున 5 గంటలకు బయల్దేరితే వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్‌కు 8 గంటలకు చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రామప్పలో రామలింగేశ్వర స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, కనేపల్లి పంప్ హౌజ్ సందర్శించవచ్చు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ టూర్ ప్యాకేజీ శనివారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.1850. పిల్లలకు రూ.1490.
Vande Bharat Express: ఆ పని చేయొద్దు ప్లీజ్… దక్షిణ మధ్య రైల్వే రిక్వెస్ట్
Telangana Tourism Vemulawada Tour: తెలంగాణ టూరిజం వేములవాడకు ఒక రోజు టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరాలి. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శన ఉంటుంది. ఆ తర్వాత వేములవాడ బయల్దేరాలి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన తర్వాత కొండగట్టు బయల్దేరాలి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించిన తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ టూర్ ప్యాకేజీ శనివారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.1200. పిల్లలకు రూ.960.