10 ఏళ్ల తర్వాత మీరా జాస్మీన్ రీఎంట్రీ

10 ఏళ్ల తర్వాత మీరా జాస్మీన్ రీఎంట్రీ తెలుగులో నటించిన సినిమాల సంఖ్య తక్కువే అయినా మంచి గుర్తింపును అందుకుంది మీరా జాస్మిన్. గుడుంబా శంకర్, భద్ర, పందెంకోడి లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె.. 2014లో పెళ్లి చేసుకుని సినిమాలు తగ్గించేసింది. మలయాళంలో అప్పుడప్పుడు  కొన్ని చిత్రాల్లో నటించినా తెలుగులో సినిమాలు చేసి పదేళ్లు దాటింది. మళ్లీ ఇన్నేళ్లకు ‘విమానం’ అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తోందామె. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌‌‌‌తో కలిసి కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ స్టూడియోస్‌‌‌‌ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం మీరా జాస్మిన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్‌‌‌‌ చెబుతూ ఓ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలోనూ బోల్డ్ ఫొటో షూట్స్‌‌‌‌తో అభిమానులను ఫిదా చేస్తోంది మీరా. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమె తిరిగి బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *