Chandrababu Naidu: చంద్రబాబుకు ప్రమాదం.. కారును ఢీకొన్న మరో కారు.. !

చంద్రబాబు కారుకు ప్రమాదం జరిగింది.  తూర్పు గోదావరిలో చంద్రబాబు రోడ్డు షో జరుగుతోంది.ఈ సందర్భంగా ఓ అపశృతి చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే చంద్రబాబు కారుకు ముందు ఉన్న బంపర్ వంగిపోయింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు ముందుకు అకస్మాత్తుగా మరొక వాహనం వచ్చింది. అతివేగంగా చంద్రబాబు కారు ముందుకు వచ్చి.. ఢీ కొడుతూ వెళ్లిపోయింది. అనంతరం ఆ కారు డ్రైవర్ కాస్తా దూరం వెళ్లిన తరువాత పక్కకు నిలిపాడు.

Wedding Gift: పెళ్లికి వచ్చినవారికే అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలుసా ?

అయితే ఈ ఘటనతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు భద్రతకు సంబంధించి టీడీపీ నేతల్లో పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఢీ కొట్టిన  కారు ముందు నుంచి చంద్రబాబు వాహన శ్రేణితో వచ్చిందా? లేకుంటే అనుకోకుండా వచ్చిందా? అని తెలియాల్సి ఉంది. బుధవారం చంద్రబాబు హైదరాబాద్ నుంచి  రాజమండ్రి ఎయిపోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాసేపు ఓపెన్ టాప్ లో ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు.

అనంతరం ఓపెన్ టాప్ కారు దిగి.. మరో ప్రత్యేక వాహనంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. ఈ రోడ్డు షో చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.  వేరే కారు అకస్మాత్తుగా చంద్రబాబు కారు ముందుకు వచ్చి ఢీ కొడుతూ ముందుకు వెళ్లింది. అయితే టీడీపీ అధినేతకు పెనుప్రమాదం తప్పడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. టీడీపీ ఆ దిశగా వివరాలు సేకరిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *