Horoscope Today Feb 16th ఈరోజు మిధునంతో సహా ఆరు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు…!

horoscope today 16 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…

horoscope today 16 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశుల వారిపై ఈరోజంతా మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో వృషభరాశి వారికి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. సింహ రాశి వారు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఈ సందర్భంగా మేషరాశి నుంచి మీన రాశులలో ఏ రాశి వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు ఉండొచ్చు. దీని వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. మీకు పిల్లల వైపు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. ఉద్యోగులకు మంచి ఆఫర్లొస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం ఉంది. రాత్రి సమయం మీ ప్రియమైన వారితో సరదాగా గడుపుతారు.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు అరటి చెట్టు ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

Zodiac Signs ఈ ఆరు రాశుల వారు బ్రేకప్ బాధ నుంచి అస్సలు బయటపడలేరు…!

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారిలో పని చేసే వారికి శ్రమకు తగ్గ ఫలితాలొస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు మంచిగా ఉంటుంది. రాజకీయ రంగాల్లో ఉండే వారికి, తాము చేసే ప్రయత్నాల్లో మంచి విజయాలను సాధిస్తారు. పొత్తులతో పాటు కొన్ని లాభాలను కూడా పొందుతారు. మరోవైపు కొందరు వ్యక్తుల కారణంగా, మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు చీమలకు పిండి, ఆవులకు పచ్చి గడ్డి తినిపించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొస్తాయి. మీకు తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు తోబుట్టువుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకిష్టమైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రణాళిక బద్ధంగా పని చేయడం వల్ల మీరు పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు శ్రీ మహా విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు విదేశాలకు వెళ్లే వ్యక్తులకు పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ వైవాహిక జీవితంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీకు మానసిక ఒత్తిడి ఉండొచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వ్యక్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు విద్య లేదా ఏదైనా పోటీలో విజయం సాధించడం వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది.

ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు గురు మంత్రాలతో పాటు విష్ణు సహస్రనామం పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. సానుకూలంగా ఆలోచించడం వల్ల జీవితంలో మీరు ముందుకు సాగేందుకు అవకాశం లభిస్తుంది. మొబైల్ లేదా ల్యాప్ టాప్ ని ఎక్కువగా చూడటం మానుకోవాలి. లేదంటే కంటికి సంబంధించిన సమస్యలు రావొచ్చు. ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం, మీరు చేసే ప్రయత్నాల ద్వారా కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.

ఈరోజు మీకు 98 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు తులసి చెట్టుకు నీరు సమర్పించి, దీపం వెలిగించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. దీని వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే పని రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా మంచి ప్రయోజనాలను పొందొచ్చు. మధ్యాహ్నం తర్వాత ఏదైనా చట్టపరమైన వివాదాల్లో మిమ్మల్ని విజయం వరిస్తుంది. విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు రెండు పెద్ద ఆర్డర్ల కారణంగా మంచి లాభాలు రావొచ్చు.

ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొద్దిగా బెల్లం ఉంచాలి.

Mahashivratri 2023 శివ పురాణం ప్రకారం.. ఈ పరిహారాలు పాటిస్తే.. డబ్బు విషయంలో తిరుగనేదే ఉండదు…!

తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు సామాజిక పనుల వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ రంగంలో మీరు శుభవార్తలను వింటారు. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈరోజు మీ ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారులకు స్వల్పకాలిక లాభాలొస్తాయి. ఈరోజు తోబుట్టువులతో ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు.

ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు ఉపవాస దీక్ష చేసే వారు పసుపు రంగులో ఉండే ఆహారం తీసుకోవాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో బాస్ తో ఎలాంటి వాగ్వాదాలకు దిగొద్దు. లేదంటే మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి సహాయంతో, ఏదైనా లావాదేవీల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈరోజు మీరు ఆకస్మిక పర్యటనలు చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు ఆవుకు శనగపప్పు, బెల్లం తినిపించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు అధికారుల ప్రశంసలు పొందుతారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. దీంతో పాటు మీరు డబ్బును కూడా ఆదా చేయగలుగుతారు. ఉద్యోగులకు పని విషయంలో ప్రశంసలు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు ఆత్మవిశ్వాసంతో చేసే పనిలో విజయం లభిస్తుంది.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు అరటి చెట్టుకు పూజ చేసి దీపం వెలిగించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు శక్తివంతంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ కుటుంబం, ఆర్థిక పరమైన విషయాల్లో విజయం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులు పరస్పరం సహకరించుకుంటారు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు నీటిలో పసుపు వేసి స్నానం చేయాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీరు ఆసక్తిని పెంచుకుంటారు. అత్తమామల వైపు నుంచి ధనలాభం లభిస్తుంది. దీంతో పాటు మీరు కార్యాలయంలో జట్టును నడిపించే అవకాశాన్ని కూడా పొందొచ్చు. మీరు జీవనోపాధి రంగంలో ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తే, దానికి సంబంధించి మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే, మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు రావి చెట్టు కింద ఐదు దీపాలను వెలిగించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీకు ఆర్థిక పరంగా లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ సామాజిక సర్కిల్ కూడా పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీరు చేసే పనుల్లో విజయం సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ప్రేమ జీవితంలో ఉండే వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు పసుపు వస్త్రం, పండ్లు లేదా ఇతర వస్తువులను దానం చేయాలి.

గమనిక

: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read

Latest Astrology News

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *