నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు వెంటనే త్వరపడాలి. ఎందుకంటే దరఖాస్తు చేసేందుకు ఇవాళే ఆఖరు తేదీ.
కేవలం 10వ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశం ఇవాళ్టితో ఆఖరు. దేశవ్యాప్తంగా 40 వేళ ఖాళీల్ని భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. ఇవాళ అంటే ఫిబ్రవరి 16 దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ భర్తీ చేయనున్న ఉద్యోగాలకు కనీస విద్యార్ఙత కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత. ఇవాళ అంటే ఫిబ్రవరి 16లోగా దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్ధులు ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 19 వరకూ మార్పులు చేర్పులు ఉంటే ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఇండియా పోస్ట్‌లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఉద్యోగాలు మొత్తం 40,889 భర్తీ కానున్నాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు కనీస వయస్సు 18 ఏళ్లు కాగా గరిష్టంగా 40 ఏళ్లుంది. పదవ తరగతి కనీస విద్యార్ఙతగా ఉంది. దరఖాస్తు, ఎంపిక ఇతర వివరాలన్నీ ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో ఉన్నాయి. ఆర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఇవాళే దరఖాస్తు చేసుకోవాలి.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజు కీలకం.. డీఏ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook