Mercury transit 2023: బుధ గోచారంతో ఈ 8 రాశులకు తిరగనున్న దశ, భారీగా లాభాలు

గ్రహాల రాజకుమారుడైన బుధుడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం మకరం నుంచి కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. బుధుడి కుంభరాశి గోచారం కొన్ని రాశులపై విశేషమైన ప్రభావాన్ని చూపించనుంది. కొంతమందిపై మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై ధ్యాస పెట్టాలి.

మేషరాశి

ఈ రాశికి చెందిన వ్యాపారులు రుణాలు తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లోన్ ప్లానింగ్ అనేది ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అప్పుడే సానుకూల ప్రతిఫలాలుంటాయి. ఏదైనా సరే ప్లాన్ ప్రకారం చేస్తే అంతా బాగుంటుంది. 

వృషభరాశి

వృషభరాశి వారికి టెక్నాలజీ వినియోగం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్ని విస్తరించేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తారు. దాంతోపాటు పనితీరులో మెరుగుదల ఉండాలి. అప్పుడే ప్రత్యర్ధులు సైతం విస్మయపరిచేలా రాణిస్తారు.

మిధునరాశి

ఈ రాశివారికి ఆత్మబలం పెరుగుతుంది. అదృష్టం పూర్తిగా తోడై నిలుస్తుంది. తండ్రి వ్యాపారం చేసేవాళ్లు..ఆ వ్యాపారాన్ని కొనసాగించేందుకు పూర్తిగా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడే పదోన్నతి లభిస్తుంది. 

సింహరాశి

సింహరాశి జాతకులకు జీవితభాగస్వామి కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని చేరుకునేందుకు సహకరించాల్సి ఉంటుంది. తలపెట్టిన పనికి ప్లానింగ్ విషయంలో పూర్తిగా సహకారం అందించాలి. మీ జీవిత భాగస్వామి వ్యాపారం చేస్తుంటే..కొత్త భాగస్వామి లభించే అవకాశాలున్నాయి. 

కన్యారాశి

కన్యారాశి జాతకులు రోగాలపై అప్రమత్తంగా ఉండాలి. అప్పుల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. వైద్యరంగంలో పనిచేసేవారికి లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యవారు కష్టార్జితం ఆధారంగా విజయం సాధిస్తారు. అందుకే కష్టపడుతుండాలి.

తులారాశి

తులా రాశి జాతకులు తమ మనస్సు ప్రకారం పనులు చేయాలి. చదువుకునేవాళ్లు చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. తెల్లవారుజామున లేచి చదివితే మంచి ఫలితాలుంటాయి. తండ్రి లేదా తాతయ్య సహకారం లభిస్తుంది. పెద్దలకు గౌరవ మర్యాదలు ఇవ్వడం వల్ల లాభాలుంటాయి.

మకరరాశి

ఈ రాశి జాతకులకు తమ వాయిస్ బాగుండేట్టు చూసుకోవాలి. వ్యాపారులైతే లౌక్యంగా మాట్లాడటం అలవర్చుకోవాలి. ఇతరులకు నష్టం కల్గించే పనులేవీ చేయకూడదు.

వృషభరాశి

కుంభరాశి జాతకులకు బ్యూటీ చికిత్స అవసరం. పర్సనాలిటీని మెరుగుపర్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటివరకూ ఆ అవసరాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే ఇకనైనా ఆ పని చేయాల్సి ఉంటుంది. 

Also read: Jupiter Rise 2023: బృహస్పతి ‘కేంద్ర త్రికోణ రాజయోగం’.. ఈ 3 రాశుల వారికి అపారమైన సంపద!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *