బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు దాచుకోవచ్చని అందరికీ తెలుసు. అయితే మన అకౌంట్ మెయింటైన్ చేయడానికి బ్యాంకుకు కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని అకౌంట్లకు ఈ ఛార్జీలు ఉండవు. అంతేకాదు, బ్యాంక్ అకౌంట్ (Bank Account) విషయానికి వస్తే అనేక ఛార్జీలు ఉంటాయి. ఎస్ఎంఎస్ అలర్ట్స్, డెబిట్ కార్డ్ ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) మెయింటైన్ చేయకపోతే వసూలు చేసే పెనాల్టీ ఛార్జీలు… ఇలా వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. వీటి గురించి తెలియక పెనాల్టీ ఛార్జీలు చెల్లిస్తూ ఉంటారు కస్టమర్లు. మరి మీరు ఈ పొరపాటు చేయకుండా ప్రధాన బ్యాంకుల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అంటే మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ గురించి తెలుసుకోండి.
State Bank Of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బేసిక్ సేవింగ్స్ అకౌంట్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూల్స్‌ని 2020 మార్చిలో తొలగించారు. అంతకన్నా ముందు మెట్రో, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలకు ఈ లిమిట్ రూ.3,000, రూ.2,000, రూ.1,000 చొప్పున ఉండేవి. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 లేదా రూ.15 నెలకు ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం ఎస్బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. అయితే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.1 లక్ష మెయింటైన్ చేసేవారికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ప్రతీ నెలా ఏటీఎంలల్లో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. రూ.1 లక్ష లోపు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉంటే తమకు ఇచ్చిన లిమిట్ కన్నా ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేస్తే ప్రతీ లావాదేవీకి రూ.21 + జీఎస్టీ చెల్లించాలి.
Agriculture Loan: మీరు రైతులా? 4 శాతం వడ్డీకే రుణాలు తీసుకోండిలా
HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్న కస్టమర్లు అర్బన్, మెట్రో ప్రాంతాల్లో అయితే రూ.10,000, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, రూరల్ ప్రాంతాల్లో రూ.2,500 యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఈ ఛార్జీలు రూ.150 నుంచి రూ.600 మధ్య ఉంటాయి.
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకులో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు అర్బన్, మెట్రో ప్రాంతాల్లో అయితే రూ.10,000, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, రూరల్ ప్రాంతాల్లో రూ.2,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అంతకన్నా తక్కువ ఉంటే ఛార్జీలు చెల్లించాలి. ఎంత తక్కువ బ్యాలెన్స్ ఉంటే దానిపై 6 శాతం ఛార్జీలు ఉంటాయి. లేదా రూ.500 ఛార్జీ చెల్లించాలి.
Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్న కస్టమర్లు అర్బన్, మెట్రో ప్రాంతాల్లో అయితే రూ.20,000, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, రూరల్ ప్రాంతాల్లో రూ.2,000 యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే రూ.400 నుంచి రూ.600 మధ్య ఛార్జీలు చెల్లించాలి.
PAN Aadhaar Link: పొరపాటు చేయొద్దు… మీ పాన్ నెంబర్‌కు ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేయండిలా
Kotak Mahindra Bank: కొటక్ మహీంద్రా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెట్రో ప్రాంతాల్లో అయితే రూ.10,000, నాన్ మెట్రో ప్రాంతాల్లో అయితే రూ.5,000 చొప్పున ఉన్నాయి. ఎంత తక్కువ బ్యాలెన్స్ ఉంటే దానిపై 6 శాతం ఛార్జీలు చెల్లించాలి.