PAN Aadhaar Link: పొరపాటు చేయొద్దు… పాన్ నెంబర్‍‌కు ఆధార్ లింక్ అయిందా? చెక్ చేయండిలా

పాన్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్. మీ పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ (Aadhaar Number) లింక్ చేయకపోతే పాన్ కార్డ్ చెల్లదు. పాన్ ఆధార్ లింక్ (PAN Aadhaar Link) చేయడానికి 2023 మార్చి 31 లాస్ట్ డేట్. అప్పట్లోగా పాన్ ఆధార్ లింక్ చేయకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లనిదిగా మారిపోతుంది. ఇక ఆ కార్డుతో ఎలాంటి లావాదేవీలు చేయడానికి కుదరదు. పాన్ ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అయితే ఇప్పటికే తాము పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేశామని చాలామంది అనుకుంటున్నారు. అయితే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలి. లేకపోతే చిక్కులు తప్పవు. మరి మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.

పాన్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోండిలా

Step 1- ముందుగా https://www.incometax.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Step 2- క్విక్ లింక్స్‌లో Link Aadhaar Status పైన క్లిక్ చేయండి.

Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Step 4- అందులో మీ పాన్ నెంబర్ , ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 5- సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది.

RBI Contest: ఆర్‌బీఐ నుంచి రూ.40 లక్షలు గెలుచుకునే ఛాన్స్

ఒకవేళ మీ పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ కాకపోతే 2023 మార్చి 31 లోగా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆర్‌బీఐ నుంచి రూ.40 లక్షలు గెలుచుకునే ఛాన్స్

ఒకవేళ మీ పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ కాకపోతే 2023 మార్చి 31 లోగా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ కార్డ్ ఉన్నవారంతా, మినహాయింపు వర్గం కిందకు రాని వారు, తమ పాన్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 2023 ఏప్రిల్ 1 నుంచి ఇనాపరేటీవ్‌గా మారతాయి. ఇప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2023 మార్చి 31 లోగా పాన్, ఆధార్ లింక్ చేయాలంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Railway Track: రైలు పట్టాల మధ్య కంకర ఎందుకు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటీ?

మీరు 2023 మార్చి 31 లోగా మీ పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మీ పాన్ కార్డును లావాదేవీల కోసం ఉపయోగించకూడదు. మీకు రీఫండ్స్ ఏవైనా రావాల్సి ఉంటే అవి నిలిచిపోతాయి. ఏవైనా లోపాలు ఉన్న రిటర్న్స్‌ను సరిచేయడం కూడా కుదరదు. ఫలితంగా ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ చిక్కులు ఎదుర్కోకుండా ఉండేందుకు వెంటనే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి. ఇప్పటికే పాన్, ఆదార్ లింక్ చేసినట్టైతే ఓసారి స్టేటస్ చెక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *