Shampoo Disadvantages : ఈ షాంపూలతో షుగర్ వస్తుందట జాగ్రత్త..

Shampoo Disadvantages : బ్యూటీ ప్రోడక్ట్స్.. వీటి వల్ల జరిగే నష్టాలు చాలా ఉన్నాయి. తాజాగా కొన్ని అధ్యయనాలు బ్యూటీ ప్రోడక్ట్స్ కారణంగా లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులకి హాని ఉందని చెబుతున్నాయి.

మీరు నెయిర్ పాలిష్, షాంపూ, హెయిర్ స్ప్రే ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారా.. అయితే, ఒక్క నిమిషం ఆగండి. మీరు వాడే ప్రోడక్ట్స్‌లో ఎన్నో విషపూరిత కెమికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మరింతగా పాడు చేస్తాయి. వీటిని వాడడం వల్ల అందులోని కెమికల్స్ మన లివర్, కిడ్నీలపై నెగెటివ్ ఎఫెక్ట్స్‌ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బ్యూటీ ప్రోడక్ట్స్‌తో డేంజర్..

నేటి కాలంలో అందానికి చాలా మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా అందంగా అంతే కన్వీనియెంట్‌గా ఉండాలని అనుకుంటున్నారు. వీటిని వాడేటప్పుడు కూడా అవి మంచి సువాసన వస్తూ ఉండేందుకు రకరకాల ఫ్లేవర్స్ ఉన్న ప్రోడక్ట్స్ ట్రై చేయాలని చూస్తున్నారు. కానీ, వీటి వల్ల ఆరోగ్యానికి పెద్ద ముప్పే ఉందని చెబుతున్నారు నిపుణులు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కెమికల్స్‌తోనే సమస్య..

ఏవైనా కొనాలనుకున్నప్పుడు వాటి లేబుల్స్ చెక్ చేయడం చాలా మంచిది. దీని వల్ల ఆ ప్రోడక్ట్స్‌లో ఏముంది అన్న విషయం తెలుసుకోవడానికి అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నెయిల్ పాలిష్, హెయిర్ స్ప్రే, ఆఫ్టర్ షేవ్ జెల్, షాంపూలు వాడుతున్నారు. మనల్ని ఆకర్షించేందుకు ఈ ప్రోడక్ట్స్ తయారీదారులు ఇందులో రకరకాల ఫ్లేవర్స్‌ని యాడ్ చేసి సువాసన వచ్చేలా చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని కెమికల్స్ కూడా ఉంటున్నాయి. ఇవి నిజానికి విషల్లా మారి మనపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

రసాయనాలు చర్మం గుండా..

చాలా వరకూ బ్యూటీ ప్రోడక్ట్స్‌లో అనేక కెమికల్స్ ఉంటాయి. వీటిని వాడినప్పుడు అవి మన స్కిన్ ద్వారా లోపలికి వెళ్ళి లివర్, కిడ్నీ, లంగ్స్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ మహిళల్లో డయాబెటిస్‌కి కారణమవుతుందని చెబుతోంది ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ మెటబాలిజంలోని అధ్యయనం.

థాలెట్స్‌తో ఇబ్బందులు..

థాలెట్స్ అనే రసాయనాన్ని ఎక్కువగా బ్యూటీ ప్రోడక్ట్స్, పిల్లల బొమ్మలు, ఫుడ్, డ్రింక్స్‌ని ప్యాక్ చేసే ప్లాస్టిక్‌లో వాడతారు. దీని వల్ల పిల్లలు పుట్టకపోవడం, షుగర్‌తో పాటు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Bedsheet Cleaning : బెడ్‌షీట్స్, దుప్పట్లు ఎన్నిరోజులకి ఓ సారి క్లీన్ చేయాలంటే..

ఆరేళ్ళ కాలంలో..

గడిచిన ఆరేళ్ళ కాలంలో మహిళల్లో షుగర్ వ్యాధి పెరిగింది. దీనికి థాలేట్స్ కారణమని మిచిగాన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి చెందిన సుంగ్ క్యున్ పార్క్ Sc.D, M.P.H చెప్పారు. థాలెట్స్ కారణంగా ప్రజలు రోజూ ఇబ్బంది పడుతున్నారు. అనేక జీవక్రియ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

Also Read : Hot Coffee : ఈ కప్స్ వాడితే ఎన్ని గంటలైనా కాఫీ వేడిగానే ఉంటుంది.

థాలేట్స్ కారణంగా..

ఈ థాలేట్స్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఇప్పటికే అనేక పరిశోధనలు తెలిపాయని, అయితే, వీటి ప్రభావం ఎంత ఉంటుంది, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి పూర్తి వివరాలు కనుక్కునేందుకు మరికొన్ని పరిశోధనలు అవసరమని చెబుతున్నారు నిపుణులు.

Also Read : Walking for Weight loss : ఇలా నడిస్తే త్వరగా బరువు తగ్గుతారట..

బ్యూటీ ప్రోడక్ట్స్ విషయంలో..

అయితే, మొత్తం బ్యూటీ ప్రోడక్ట్స్ విషయంలోనూ ఇదే జరుగుతుందని కాదు. మనం వాటిని వాడేటప్పుడు అందులోని ఇంగ్రేడియెంట్స్ లిస్ట్ చెక్ చేయాలి. అదే విధంగా ఏవైనా వాడే ముందు మనం దానికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలని, మనకి ఏది సూట్ అవుతుందో తెలుసుకోవడానికి వైద్యుల సలహా తీసుకుని వాడితే ప్రమాదం నుంచి చాలా వరకూ బయటపడొచ్చొని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *