బాలీవుడ్ హీరోయిన్, వివాదాస్పద నటి స్వర భాస్కర్ పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితుడు ఫహద్ అహ్మద్‌ను ఆమె సీక్రెట్‌గా వివాహమాడారు. 2023 జనవరి 6న స్వర భాస్కర్, ఫహద్ అహ్మద్ పెళ్లి జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పెళ్లి విషయాన్ని స్వర స్వయంగా సోషల్ మీడియా వేదికగా నేడు ప్రకటించారు. దాంతో పోస్ట్, పెళ్లి ఫొటోస్ చూసిన అందరూ షాక్ అవుతున్నారు.