Tata Company: దేశీయ స్టాక్ మార్కెట్లు కొద్ది రోజులుగా ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలను సాధించడం సులభమైన విషయమేమీ కాదు. మార్కెట్ అనిశ్చితిలోనూ మంచి లాభాలను ఇచ్చే స్టాక్స్‌ని గుర్తించి వాటిల్లో పెట్టబడులు పెట్టినప్పుడే అనుకున్న తీరులో లాభాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ 2023-24 పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత.. టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ లిమిటెడ్ దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 2న ఈ కంపెనీ షేరు ధర రూ.2,310 మార్క్‌కు చేరింది. గడిచిన రెండు వారాల్లో ఈ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీంతో టాటా గ్రూప్ స్టాక్ రూ.2,310 నుంచి రూ.2,535 స్థాయికి చేరింది. దీంతో ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన దేశీయ వారెన్ బఫెట్‌గా పిలిచే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala ) సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాకు (Rekha Jhunjhunwala) కాసుల వర్షం కురింపించింది. ఆమె గడిచిన రెండు వారాల్లోనే ఏకంగా రూ.1000 కోట్లు లాభాలు అందుకున్నారు.
రేఖా ఝున్‌ఝున్‌వాలా సంపద..
ఈ ఆర్థిక ఏడాది అక్టోబర్- డిసెంబర్ 2022తో ముగిసిన మూడో త్రైమాసికం లెక్కల ప్రకారం.. టైటాన్ కంపెనీలో రేఖా ఝున్‌ఝున్ వాలా (Rekha Jhunjhunwala portfolio) షేర్ హోల్డింగ్ 4,58,95,70 ఉన్నాయి. ఇది టైటాన్ కంపెనీ క్యాపిటల్‌లో 5.17 శాతంగా ఉంటుంది. గడిచిన రెండు వారాల్లో టైటాన్ షేరు విలువ రూ.2,310 నుంచి రూ.2,535కు పెరిగింది. ఒక్కో ఈక్వీటీ షేరుకు రూ.225 మేర పెరిగింది. దీంతో టైటాన్ కంపెనీ ద్వారా రేఖా ఝున్‌ఝున్‌వాలా నెట్‌వర్త్ ఏకంగా రూ.10,32,65,93,250 పెరిగింది.
ఈ టైటాన్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలో రేఖా ఝున్‌ఝున్ వాలా తన షేర్ హోల్డింగ్‌ని కొనసాగించడం వల్ల ఈ మేరకు లాభాలను అందుకుంది. ఈ కంపెనీలో 2022, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంగో ఆమెకు 1,50,23,575 టైటాన్ షేర్లు ఉన్నాయి. అది కెంపెనీ స్టాక్‌లో 1.69 శాతంగా ఉంటుంది. అలాగే.. ఆమె భర్త రాకేశ్ ఝున్‌ఝున్ వాలాకు 3,41,77,395 టైటాన్ కంపెనీ షేర్లు ఉన్నాయి. అది కంపెనీ వాటాలో 3.85 శాతంగా ఉంటుంది. మొత్తంగా ఇద్దరి షేర్లు కలిపి 4,92,00,970 టైటాన్ షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ వాటాల 5.54 శాతంగా ఉంటింది. అయితే మూడో త్రైమాసికం లెక్కల ప్రకారం ఆమె 33,05,000 షేర్లను విక్రయించారు. దీంతో ప్రస్తుతం 4.56 లక్షల కుపైగా షేర్లు రేఖా ఝున్‌ఝున్ వాలా వద్ద ఉన్నాయి.
97835600
97873995
97859922