రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : పెద్దపల్లి
బిర్యానీ అంటే మనకి గుర్తుకు వచ్చేది హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ నగరంలో గల్లీకి నాలుగైదు బిర్యానీ సెంటర్లు ఉంటాయంటే ఆశ్చర్యం కాదు. బిర్యానీతో పాటు స్ట్రీట్ ఫుడ్ కి కూడా హైదరాబాద్ ఫేమస్. ఇక్కడ దొరకని ఫుడ్స్ అంటూ ఉండదు. సాయంత్రం అయిందంటే చాలు ఎటు చూసినా స్ట్రీట్ ఫుడ్ సెంటర్లే కనిపిస్తాయి. జిగేల్ మనిపించే లైట్స్ తోస్ట్రీట్ ఫుడ్స్ పాయింట్స్ రారమ్మని ఆకర్షిస్తుంటాయి. స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎక్కువగా యువత స్ట్రీట్ ఫుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు అదే కల్చర్ హైదరాబాద్ మాదిరిగానే మిగతా నగరాలు, పట్టణాలలో కూడా స్ట్రీట్ ఫుడ్ విస్తరిస్తున్నాయి.
ప్రేమ వివాహం చేసుకునే జంటలకు.. రూ.10 లక్షలు.. 5 ఎకరాల భూమి ఇవ్వాలి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన నగరాలలో ఉన్న కల్చర్ ఇప్పుడు గోదావరిఖనిలో కూడా మొదలైంది. అడుగడునా బిర్యానీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్ స్నాక్స్ పాయింట్లు మొదలయ్యాయి. దీంతో ఒక్కప్పుడు ఉన్న గోదావరిఖనికి ఇప్పుడు ఉన్న గోదావరిఖనికి రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. సాయంత్రం అయిదంటే చాలు కలర్ ఫుల్లుగా లైట్లు, గుమ గుమా లాడే వాసన, నోరు ఊరించే పిండి వంటల వాసనతో వచ్చిపోయే ప్రయాణికులను అక్కడే ఆగేలా చేస్తున్నాయి. ఒకరకంగా గోదావరిఖని ప్రధాన మార్గం ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ కు అడ్డాగా మారింది.
Vemulawada Temple: రాజన్నకు కోడెను కడితే కోరికలు తీరుతాయట!
రుచికరమైన ఫుడ్ అతి తక్కువ ధరలు..
గోదావరిఖని ప్రాంతంలో దొరికే స్ట్రీట్ ఫుడ్ రుచికరంగా ఉండడంతో పాటు అతి తక్కువ ధరలతో లభిస్తున్నాయి. బయట రెస్టారెంట్‌లో దొరికే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో దొరకడంతో పాటు.. తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో అందరి చూపు ఇటు వైపే పడుతుంది. చికెన్ స్నాక్స్, బిర్యానీలు, బార్బీ చికెన్ వంటివి తక్కువ ధరలకే దొరుకుతుంది. టిఫిన్ సెంటర్లలో కూడా సాధారణ ధరలే ఉన్నాయి.
ఉపాధి మార్గంగా స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు..
ఇక్కడ ఒక్కొక్కటి స్ట్రీట్ ఫుడ్ కార్నర్స్ పెరుగుతుండడంతో ఎవరి ఇంటి ముందు వారే బిర్యానీ పాయింట్లు, స్నాక్స్, కర్రీ పాయింట్లు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఈ దారిలో ఇండ్లు ఉన్నవారికి అదృష్టం కలిసి వచ్చింది అనిచెప్పుకోవాలి. ముఖ్యంగా యువతకి, మహిళలకు ఇది ఉపాధిగా మారింది. ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ పాయింట్లలో మహిళలు, యువకులవే అధికంగా ఉన్నాయి.