ఒక్క పాట కోసం 7 సెట్స్.. బడ్జెట్ కస్టడీ దాటిన నాగ చైతన్య

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అందులో ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ‘థాంక్యూ’ ఒకటి కాగా.. హిందీలో అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ మరొకటి. ఈ నేపథ్యంలోనే తన అప్‌కమింగ్ మూవీ ‘కస్టడీ’ (Custody) పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు చై. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) బైలింగువల్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అయితే, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అభిమానులను ఖుషీ చేస్తోంది.

‘కస్టడీ’ మూవీలో లీడ్ పెయిర్ నాగ చైతన్య, కృతి శెట్టిపై చిత్రీకరించే పాట కోసం ఏకంగా ఏడు సెట్లు (Seven Sets) నిర్మించారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డి.వై. సత్యనారాయణ కలిసి ఈ భారీ సెట్స్‌ను రూపొందించారు. శేఖర్ మాస్టర్ (Sekhar Master) కొరియోగ్రఫీ అందించిన ఈ పాట వెండి తెరపై ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఫీలింగ్ ఇవ్వనుందని తెలుస్తోంది. కాగా కస్టడీ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ రోల్ చేస్తుండగా.. ప్రియమణి పవర్‌‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇంకా ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే, నాగ చైతన్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాల్లో ‘కస్టడీ’ ఒకటి. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతున్న మూవీకి అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా.. ఎస్‌ఆర్‌ ఖదీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వెంకట్ రాజన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అంతేకాదు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కలిసి కస్టడీ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరు కలిసి ఒకే సినిమాకు పనిచేయడం ఇదే మొదటిసారి.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *