టీడీపీ నేతకు.. వైసీపీ బంపర్ ఆఫర్.. చంద్రబాబుకు సీఎం జగన్ మాస్టర్ స్ట్రోక్

AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ఇప్పటికే ఎన్నికల హడావుడి అన్ని పార్టీలలో కనిపిస్తోంది. సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నా.. అన్ని పార్టీల్లో నేడే రోజు ఎన్నికలు అన్న ఫీలింగే కనిపిస్తోంది. దీంతో జంపింగ్ జపాంగ్ లపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. అయితే ఎక్కువగా అధికార వైసీపీకే ఈ బెడద ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 35 మందికి పైగా ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది. వారంతా ఇప్పటికే తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆనం రామ నారయణ రెడ్డి (Anam Ramanarayan Reddy).. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) లో అధిష్టానంపై ధిక్కార స్వరం విపించారు. సైకిల్ ఎక్కుతున్న సిగ్నల్స్ కూడా ఇచ్చారు. వారి దారిలోనే మరికొందరు కీలక నేతలు సైకిల్ ఎక్కుతారనే ప్రచారం ఉంది. అయితే ఇదే సమయంలో టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎ జగన్ మోహన్ రెడ్డి.. ఇందులో భాగంగా ఆ పార్టీలో కీలక నేతలకు గాలం వేస్తున్నారు. కేవలం పార్టీలోకి ఆహ్వానించడమే కాదు.. కీలక బాధ్యతలు కట్టబెడుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ముఖ్యంగా అర్బన్ ఓటర్ల నాటి ఈ ఎన్నికల ద్వారా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఎన్నిలకను అన్ని ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు.. టీడీపీ కీలక నేత జయమంగళం కు.. ఎమ్మెల్సీ ఆఫర్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

జయమంగళం బ్యాక్ గ్రౌండ్ ఇదే..?

జయమంగళ వెంకటరమణ చేరికతో కైకలూరులో వైసీపీ మరింత పటిష్టం అవుతుంది అధిష్టానం భావిస్తుంది. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్. ఈసందర్భంగా జమమంగళ వెంకటరమణ మాట్లాడుతూ… 1999లో వ్యాపారాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. టీడీపీలో జెడ్పీటీసీగా అవకాశం వచ్చిందని.. ఆ సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నారు. అయితే 2009లో టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిందని.

ఇదీ చదవండి : సీఎం నివాసంలో గోశాలను చూసి మైమరచిన చాగంటి.. సీఎం పై ప్రశంసల వర్షం

అయితే ఓ జింకను రెండు పులుల మధ్య నిలబెట్టినట్టు తనకు ఓ ఇద్దరు బడా నేతల ముందు నిలబెట్టి టిక్కెట్టిచ్చారు అన్నారు. 2009లో కష్టపడి గెలిచాను అన్నారు. 2014లో తాను గెలుస్తానని అంతా భావించారని.. తాను సైతం 40 వేల మెజార్టీ వస్తుందని భావించాను అన్నారు. 2014 ఎన్నికల్లో తనను నామినేషన్ వేయమన్న చంద్రబాబు.. బీజేపీతో పొత్తు కుదిరిందని తప్పుకోమన్నారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబుతో ఒప్పించి నామినేషన్ ఉప సంహరించుకునేలా చేశారన్నారు. అయితే టీడీపీ గెలిచాక ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామన్నారు. కానీ ఐదేళ్లు కళ్లు కాయలు కాచేలా చూసిన ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్నారు.

ఇదీ చదవండి : టీడీపీలో చేరుతున్న కన్నా..! చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటంటే..?

కైకలూరు ఇన్ఛార్జీగా ఉన్నా.. తనను చెప్పు కింద తేలులా తొక్కి ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి అనుభవించిన కామినేని 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా.. తప్పుకున్నారు. పోలేరమ్మకు గొర్రెను బలి ఇచ్చినట్టుగా 2019 ఎన్నికల్లో నాకు సీటు ఇస్తారు.మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే పుకార్లు పుట్టించిన తర్వాత రకరకాల మంది వస్తారని మళ్లీ ప్రచారం పెట్టారు అన్నారు. పిన్నమనేని, కామినేని, కొనకళ్ల ఇలా చాలా మంది వస్తారని ప్రచారం చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి : డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నాని .. ఆర్టీసీ బస్సు ఎలా నడిపారో చూడండి..

కానీ జగన్ దగ్గరకు వస్తే పేదలకు మేలు చేయగలననే ఉద్దేశ్యంతో వైసీపీలో చేరాను అన్నారు. ఇప్పటికే జగన్ తనకు ఎమ్మెల్సీగా హామీ ఇచ్చారని.. అందుకు జగనుకు రుణపడి ఉంటాను అన్నారు. వైఎస్ తరహాలోనే జగన్ కూడా పేదలకు మేలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *