డేవిడ్ వార్నర్‌పై ప్రతీకారం తీర్చుకున్న మహ్మద్ షమీ.. కనీసం తల కూడా తిప్పలేదు!

IND vs AUS 2nd Test : ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (David Warner)పై ఢిల్లీ టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ప్రతీకారం తీర్చుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఆస్ట్రేలియా టీమ్ 15 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వలేదు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (15: 44 బంతుల్లో 3×4) పట్టుదలతో క్రీజులో నిలవగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (50 బ్యాటింగ్: 74 బంతుల్లో 8×4, 1×6) ఎదురుదాడి చేస్తూ కనిపించాడు.

వాస్తవానికి ఇన్నింగ్స్ 13వ ఓవర్ వరకూ డేవిడ్ వార్నర్ చాలా నెమ్మదిగా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. అప్పటి వరకూ 38 బంతుల్లో కేవలం 7 పరుగులే చేసిన వార్నర్.. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదేశాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వేసిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ కవ్వింపుగా షమీ వైపు చూశాడు. దాంతో షమీ ఆ ఓవర్‌లో లాస్ట్ బాల్‌ని పుల్లర్ లెంగ్త్ రూపంలో వేయగా.. బంతి వార్నర్ ఫ్యాడ్స్‌కి తాకింది. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దాంతో షమీ పూర్తి అసహనంతో కనిపించాడు.

ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన మహ్మద్ షమీ.. అంతక ముందు ఓవర్‌లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలకి బదులు తీర్చుకున్నాడు. రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేసిన మహ్మద్ షమీ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతిని వేయగా.. డేవిడ్ వార్నర్ బంతిని డబుల్ మైండ్‌లో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాంతో అతని బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేతుల్లో పడింది.

బంతి వెళ్లిన తీరుతో వార్నర్ కనీసం వెనక్కి తిరిగి చూడకుండానే పెవిలియన్ వైపు నడిచాడు. అంతకముందు ఓవర్‌లో తనని కవ్వించిన వార్నర్‌ని ఔట్ చేసిన మహ్మద్ షమీ గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టులోనూ డేవిడ్ వార్నర్‌ని తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు వద్దే మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో కూడా రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేస్తూనే వార్నర్‌ వికెట్‌ని షమీ తీయడం గమనార్హం.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *