ఫస్ట్ టైమ్ విమానం ఎక్కిన గంగవ్వ.. ఎక్కడికెళ్తుందో చెప్పుకోండి చూద్దాం!

వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమేనని నిరూపించిన వాళ్లలో గంగవ్వ (Gangavva) కూడా ఒకరు. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటూ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఆడియన్స్‌కు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది గంగవ్వ. బిగ్‌బాస్‌ (BiggBoss)లో అడుగుపెట్టి గంగవ్వ అప్పట్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే 62 ఏళ్ల గంగవ్వ ఫస్ట్ టైమ్ విమానం ఎక్కింది. దీంతో తెగ సంబరపడిపోయింది

ఎక్కడికి ప్రయాణం?

ఫిబ్రవరి 16న తన జీవితంలో తొలిసారి విమాన ప్రయాణం చేస్తున్నట్లు గంగవ్వ తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో, ఫ్లైట్ ఎక్కిన తర్వాత తీసుకున్న సెల్ఫీలను పంచుకుంది.

“గంగవ్వ మొదటి విమాన ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నాం ఊహించండి? (శివరాత్రి హింట్)” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు గంగవ్వ ఎక్కడికెళ్తుందో మొత్తానికి కనిపెట్టారు.

కోయంబత్తూర్

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం ఇషా ఫౌండేషన్‌కు గంగవ్వ వెళ్తుంది. మహా శివరాత్రిని జరుపుకోవడానికి కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్ ఆది యోగి దగ్గరకు గంగవ్వ వెళ్తున్నట్లు చాలా మంది నెటిజన్లు కనిపెట్టేశారు. గంగవ్వ 2021లో తొలిసారి హౌలికాప్టర్ ఎక్కింది. ఇప్పుడు 2023లో ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గంగవ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో తన స్టైల్‌తో తెలుగు టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆమె ఐదు వారాల పాటు బీబీ హౌస్‌లో ఉంది. అయితే ఆరోగ్య కారణాల వల్ల మధ్యలోనే వచ్చేసింది. కానీ ఇప్పటికీ గంగవ్వ.. యూట్యూబ్ వీడియోలు, అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

97999605

కలల ఇల్లు కట్టుకొని

బిగ్‌బాస్‌లో తన కో కంటెస్టెంట్ అయిన సుజాతతో కలిసి గంగవ్వ ‘ఆహారం ఆరోగ్యం’ అనే టీవీ షో కూడా చేసింది. అలానే బిగ్‌బాస్ తెలుగు హోస్ట్ అక్కినేని నాగార్జున సహాయంతో ఆమె తన గ్రామంలోనే ఓ ఇల్లు కూడా కట్టుకుంది. ఇందుకోసం నాగార్జున.. రూ.7 లక్షలు గంగవ్వకు ఇచ్చారు. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో గంగవ్వ ఓ చిన్న పాత్ర పోషించింది. అంతకుముందు అక్కినేని నాగ చైతన్య సినిమా ‘లవ్‌ స్టోరీ’లో కూడా మెరిసింది. ప్రస్తుతం కొన్ని సినిమాలతో గంగవ్వ బిజీగా ఉంది. వీటితో పాటు యూట్యూబ్‌లో మై విలేజ్ షో అంటూ కొన్ని వీడియోలు కూడా చేస్తుంది.

Read latest TV News and Movie Updates

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *