Pawan Birthday Wishes to CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు తన 69వ బర్త్ డేను జరుపుకుంటున్నారు. రాష్ట్ర సాధన సమయంలో చావు నోట్లో తలపెట్టిన ఉద్యమకారుడు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. ఆ తరువాత రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు దేశ్ కీ నేతగా మారారు. కేసీఆర్ బర్త్ డే సందర్బంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడంతో పలు సేవా కార్యక్రమాలు తలపెట్టారు. ఇక కేసీఆర్ కు పలువురు ప్రముఖ రాజకీయ, సినీ, క్రీడా సహా ఇతర రంగాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
‘భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా జీవితంలో తనదైన పంథాను కలిగిన శ్రీ కేసీఆర్ గారికి సంతోషకరమైన జీవితం, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పవన్ ట్వీట్ చేశారు.