Saturn rise: కుంభరాశిలో ఉదయించనున్న శని, మార్చ్ 9 నుంచి ఆ 4 రాశులకు ఊహించని డబ్బు

అదే విధంగా హిందూమతంలో న్యాయదేవతగా భావించే శనిగ్రహం మార్చ్ 9వ తేదీన ఉదయించనున్నాడు. ఫలితంగా 4 రాశులకు అత్యంత శుభం జరగనుంది. ధన సంపదలు కలుగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. ఆ వివరాలు మీ కోసం…

జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని కర్మని బట్టి ఫలాల్ని ఇచ్చే దేవతగా కొలుస్తారు. శనిగ్రహం ఎవరిపైనైనా ప్రసన్నుడైతే..ఆ ఇంట ఇక సుఖ సంతోషాలు, అంతులేని సంపద కలుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం శనిగ్రహం కదలికల్లో మార్పు వస్తే..ఆ ప్రభావం భూమిపై, మనిషి జీవితంపై తప్పకుండా పడుతుంది. మార్చ్ 9వ తేదీన శని గ్రహం ఉదయించనున్నాడు. ఆ రోజు శనిగ్రహం కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశుల జీవితంలో అభివృద్ధి, ధనలాభం కలుగుతుంది. 

శని ఉదయంతో ప్రయోజనం పొందే రాశులివే

మకర రాశి

శని దేవుడు మీ కుండలిలోని రెండవ పాదంలో ఉదయించనున్నాడు. దాంతో మీరు ఏ పని చేపట్టినా అందులో రాణిస్తారు. పెళ్లికానివారికి సంబంధాలు ఖరారౌతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు విజయం లభిస్తుంది విదేశాలకు వెళ్లే యోగం కలుగుతుంది. 

సింహ రాశి

శనిదేవుడు ఈ రాశిలో 7వ పాదంలో ఉంటాడు. దాంతో సింహరాశి జాతకుల ఆర్ధిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించవచ్చు. ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందం ఫైనల్ కావచ్చు. మీ జీవిత భాగస్వామి అభివృద్ధి ఉంటుంది. వైవాహిక జీవితం పూర్తిగా బాగుంటుంది. అంతటా ఆనందం, సుఖ సంతోషాలు లభిస్తాయి.

తులా రాశిA

శని ఉదయించడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి యోగం ఏర్పడుతుంది. వ్యాపారం, రాజకీయాలకు చెందిన వ్యక్తుల కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుతారు. సంతానయోగం పూర్తవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలుంటాయి. పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. జీవితంలో ఏ విషయానికీ తిరుగుండదు. 

వృషభ రాశి

శనిదేవుడిని కర్మఫలం, విధికి అధిపతిగా భావిస్తారు. శని ఉదయించడం అత్యంత అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఈ ప్రభావంతో ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే నిర్ణయం తీసుకుంటారు.

Also read: Mahashivratri 2023 Vrat Foods: మహా శివరాత్రి రోజు ఉపవాసంలో తీసుకునే అల్పాహరం ఫుడ్స్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *