Sir Movie Review: ధనుశ్ ‘సార్’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను ఆకట్టుకుందా..

రివ్యూ : సార్ (Sir)

నటీనటులు : ధనుశ్, సుమంత్, సంయుక్త మీనన్, సాయి కుమార్, సముద్రఖని, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, తదితరులు..

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్

సంగీతం: G.V.ప్రకాష్ కుమార్

నిర్మాత : నాగ వంశీ, సాయి సౌజన్య (సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్)

దర్శకత్వం: వెంకీ అట్లూరి

విడుదల తేది : 17/2/2023

తమిళ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధ‌నుష్ విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేసారు. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో వస్తే.. తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. మరి ఈ సినిమాతో ధనుశ్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

ధనుశ్ (బాల గంగాధర్ తిలక్) ఒక త్రిపాఠి ప్రైవేటు కాలేజ్‌లో ఓ లెక్చరర్. దీని అధినేత శ్రీనివాస త్రిపాఠి (సముద్రఖని). తన కాలేజీల బాగు కోసం ఇతను గవర్నమెంట్ కాలేజీలను నిర్వీర్యం చేస్తూ ఉంటాడు. అక్కడ  మంచిగా పాఠాలు చెప్పే ఫ్యాకల్టీలను తన ధన బలంతో తన కాలేజీలో చేర్చుకుంటూ ఉంటాడు. అలా పేదలకు మంచి విద్య దూరం చేస్తూ ఉంటాడు.  ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు గురువులకు లేకపోవడంతో అక్కడ విద్యార్థులు త్రిపాఠి నిర్వహించే  కాలేజీలో చేరడం లేకపోతే చదవు మానేసే పరిస్థితులు తీసుకొస్తాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం  ఫీజుల నియంత్రణపై ఒక బిల్లు తీసుకురావాలని చూస్తోంది. త్రిపాఠి ఇన్‌స్టూట్యూషనల్ తరుపున మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలను దత్తత తీసుకుందాం అని చెబుతారు.

ఈ నేపథ్యంలో తనతో సహా ప్రైవేటు కాలేజీలు నిర్వహిస్తోన్న వాళ్లతో కలిసి ప్రభుత్వ కాలేజీలకు తమ కాలేజీలో  జూనియర్ లెక్చరర్స్ పంపిస్తానని ప్రభుత్వానికి చెబుతారు.  ఈ నేపథ్యంలో తన కాలేజీని నుంచి బాల గంగాధర్ తిలక్‌ సహా కొంత మందిని ఊర్లలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో చదువులు చెప్పించడానికి పంపిస్తారు. ఈ నేపథ్యంలో బాలు సిరిపురం గ్రామానికి వెళతాడు. అక్కడ ఉంటే విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాడు.  అక్కడి విద్యార్ధులు మంచి మార్కులు రావడం చూసి గిట్టని త్రిపాఠి.. అక్కడ చదువు చెప్పడం మానేసి తన కాలెజీకి రమ్మని చెబుతాడు. ఈ నేపథ్యంలో బాలు.. త్రిపాఠి మధ్య వైరం ఏర్పడుతోంది. అతని ప్రైవేటు కాలేజీలకు పోటీగా తను చదువులు చెప్పిన విద్యార్ధులు ఎలా మంచి మార్కులతో పాస్ అయ్యేలా చేసి త్రిపాఠికి ఎలా గుణపాఠం చెప్పాడనేది  ‘సార్’ మూవీ స్టోరీ.

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే.. 

దర్శకుడు వెంకీ కుడుములు విద్య వంటి బర్నింగ్ ఇష్యూను తన కథా వస్తువుగా తీసుకున్నారు. ఇలాంటి తరహా కథలు గతంలో టి.కృష్ణ తన సినిమాల్లో చర్చించారు. ఇక శంకర్ కూడా ‘జెంటిల్‌మెన్’ చిత్రంలో కూడా ఇదే విషయాన్ని కమర్షియల్ కోణంలో చూపించారు. ఇక తమిళంలో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ‘శక్తి’ సినిమా కూడా ఇదే తరహాలో కార్పోరేట్ విద్యతో ఎలా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతాయనే విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. అటు హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ కూడా దాదాపు ఇదే కథ.  ఇక ‘సార్’ సినిమాలో కూడా అదే విషయాన్ని టచ్ చేసారు. ఒక ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగం వస్తే ఆ లెక్చరర్‌కు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటోంది. ఎలక్షన్స్ వంటి వాటితో పాటు జనాభా లెక్కల సేకరణ వంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆచార్యుల సేవలు ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునే చాలా మందికి.. అలాంటి ఉద్యోగం ఒదిలిపెట్టి కార్పోరేట్ కాలేజీలో చేరడం వంటివి ఈ సినిమాలో చూపించడం కరెక్ట్‌గా అనిపించలేదు. చాలా మంది లెక్చరర్లు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. ప్రైవేటులో పార్ట్‌టైమ్ లేదా ట్యూషన్స్ గట్రా చెబుతూ ఉంటారు.  ఇక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. డబ్బులున్న వాడు ఈ లెక్కన కొంటాడు. తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కొంటాడు అనే డైలాగులు బాగున్నాయి.

ఒక ప్రభుత్వ కాలేజీలో ప్రైవేటుకు సంబంధించిన లెక్చరర్లు పంపంచి పాఠాలు చెప్పించడం అంతగా కనెక్ట్ కాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా మంది డీఎస్సీ వంటి వాటికి ప్రిపేర్ అవుతాంటారు. అలా రానీ వాళ్లే ప్రైవేటు కాలేజీల్లో తప్పనిసరై ఉద్యోగంలో చేరుతున్నారు. మొత్తంగా వెంకీ కుడుముల తాను చెప్పాలనుకున్న పాయింట్ బాగనే ఉన్న.. ఇప్పటికే ఎంతో మంది దర్శకులు ఆ ఫార్ములా సినిమాలు చేసేసారు. ఆ తరహా కథను విద్యార్ధులకు ఇపుడు ఆన్‌లైన్ క్లాసులు చెప్పినట్టే.. ఒక ఊరిలో ఉండే పిల్లలకు వీడియో కాసెట్స్ ద్వారా పాఠాలు చెప్పంచడం అనేది మాత్రం కాస్త కొత్తగా ఉంది. కమర్షియల్ అంశాల కోసం మూడు చోట్ల ఫైట్స్ కూడా కథలో భాగంగా పెట్టాడు.  మిగతాదంత రొటిన్. మొత్తంగా మన తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా విద్యను వ్యాపారంగా మలిచిన కొంత కార్పోరేట్లకు ఒక సామాన్య గురువుకు మధ్య జరిగిన పోరాటంగా ఈ సినిమాలో చూపించాడు. మొత్తంగా ప్రస్తుతం విద్య అనేది డబ్బున్న వాడికి సొంతం అనే రీతిలో ఉంది. దాన్ని ఒక సామాన్యుడైన ఒక కాలేజీ సార్ ఎలా ఎదుర్కొని పోరాడి నిలుచున్నాడనేది ఈ సినిమాలో చూపెట్టాడు వెంకీ అట్లూరి. ఈ సినిమాకు దినేష్ కృష్ణన్  ఫోటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాష్ ప్రకాష్ అందించిన ‘మాస్టారు మాస్టారు’  పాట మాత్రం క్యాచీగా ఉంది. మిగతాదంతా సో..సో..

నటీనటుల విషయానికొస్తే..

ధనుశ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాల గంగాధర్ అనే లెక్చరర్ పాత్రలో అద్భుతంగా నటించారు. సంయుక్త మీనన్ కూడా తన పరిధి మేరకు బాగానే నటించింది. ఇక కార్పోరేట్ కాలేజీల నిర్వాహకుడు శ్రీనివాస్ త్రిపాఠి పాత్రలో సముద్ర ఖని పాత్రలో తన విలనిజం బాగానే పండించాడు. సాయి కుమార్ అమాయకుడైన విలన్ పాత్రలో ఒదిగిపోయారు. మిగతా పాత్రల్లో నటించిన తనికెళ్ల భరణి, సుమంత తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్

ధనుశ్ నటన

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ 

ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన కథ

కమర్షియల్ అంశాలు లేకపోవడం

సెకండాఫ్

చివరి మాట: ‘సార్’ మూవీ ఆలోచింప చేసే ఎడ్యుకేషనల్ డ్రామా..

రేటింగ్ : 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *