Minister Talasani | మెడికల్‌ హబ్‌గా మారుతున్న తెలంగాణ : మంత్రి తలసాని

Minister Talasani | సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ మెడికల్‌ హబ్‌గా మారుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. వరల్డ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ డే సందర్భంగా సొసైటీ ఫర్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ ఇండియా ( సెమి ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో నిర్వహించిన 5కే, 10కే మారథాన్‌, సైక్లాథాన్‌ 10 కే రన్‌లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ పెరిగిందని అన్నారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర రావు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *