Road Accident | కాలువలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

Road Accident | ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రేపల్లె మండలం రావి అనంతవరం శివారులో అతివేగంగా వచ్చిన ఓ లారీ కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి నాపరాయిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వారిగా గుర్తించారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *