మహానాడు ప్రాంగణం అస్తవ్యస్తం.. కూలిన బారికేడ్లు, టెంట్లు రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద గాలి దుమారంతో టెంట్లు కూలిపోవడంతో పాటు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. భారీ వర్షానికి బారికేడ్లు కొట్టుకుపోయాయి. ఈదురు గాలులతో మహానాడు ప్రాంగణం అస్తవ్యస్తమైంది.
నేలకొరిగిన ఎన్టీఆర్ కటౌట్
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద నిర్వహిస్తోన్న టీడీపీ మహానాడు రెండో రోజులో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మహానాడు జరుగుతోన్న ప్రాంతంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు ఫ్లెక్సీలు కూలిపోయాయి. సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో ఎన్టీఆర్ కటౌట్ నేలకొరిగింది. పెను ప్రమాదం తప్పింది. వేదిక పై ఉన్న ఎల్‌ఈడీలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది.
మహానాడు బహిరంగ సభలో టీడీపీ కార్యకర్తలు తడిసిపోయారు. భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా మహానాడులోని సభా ప్రాంగణం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కటౌట్ వీఐపీ టెంట్‌పై పడింది. మరోవైపు.. అయితే అప్పటి వరకు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, అశోక్ గజపతి రాజు, పంచుమర్తి అనురాధ తదితర ముఖ్యనేతలు అక్కడే వున్నారు. వీరంతా బయటకు వచ్చిన కాసేపటికీ కటౌట్ ఆ టెంట్‌పై పడింది.
©️ VIL Media Pvt Ltd.