K. Gangadhar, News18, Guntur
మైగ్రైన్ అనేది మహిళలలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళలు పిరియడ్స్ సమయంలో మైగ్రైన్ వల్ల మరింత ఇబ్బందికి గురౌతారు. చిన్న పాటి శబ్ధం వినిపించినా వారు తట్టుకోలేరు, పైగా వారు చాలా హైపర్ యాక్టివ్ గా కూడా ఉంటారు. ఎదుటి వారు చిన్న మాట అన్నా సరే వారు చాలా వయొలెంట్ గా రియాక్ట్ అవుతుంటారు. ఒక్కోసారి కొంచెం నలతగా లేదా మూడీగా కూడా ఉంటారు.
మైగ్రైన్ నాలుగు రకాలుగా ప్రభావం చూపిస్తుంది.
మైగ్రైన్ అనేది ఒక పీరియాడికల్ డిఆర్డర్ ,ఇది వారంలో రెండు రోజులు లేదా నెలలో కొన్ని రోజులు ఇలా అప్పుడప్పుడూ వస్తూ తన ప్రభావము చూపిస్తుంది. మైగ్రైన్ ప్రభావం నాలుగు దశలుగా ఉంటుంది. ప్రీమానిటరీ ఫేజ్ , ఆరా ఫేజ్ , హెడేక్ ఫేజ్ ,పోస్ట్ డ్రోమ్ అని నాలుగు రకాలుగా మైగ్రైన్ తన ప్రభావం చూపిస్తుంది.
మొదటి దశలో నలతగా ఉండటం, మెడ పట్టేసినట్లు అనిపించడంవంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజులు గడిచే కొద్ది విపరీతమైన తలనొప్పి కొద్ది పాటి శబ్ధాలను కూడా భరించలేనంతగా ఇరిటేషన్ రావడం వంటి లక్షణాలు బయట పడతాయి.
మైగ్రైన్ లక్షణాలను ముందుగా గుర్తించడం వలన వ్యాధి మరింత తీవ్రం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.అంతే కాకుండా సాధారణ తలనొప్పికి వాడే ట్యాబ్లేట్లు వాడటం వ్యాధిని తగ్గించకపోగా మరింత ప్రమాదకర దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంది. మైగ్రైన్ లక్షణాలు కనిపించిన వెంటనే సరైన డాక్టర్ ని సంప్రదించి ఆయన సూచనల మేరకు మందులు వాడటం వలన మెరుగైన ఫలితాలు పొందవచ్చు.