శుబ్‌మన్ గిల్, ధోనీని ముంచేస్తాడు! కోహ్లీ, రోహిత్ ఇప్పటికే.. భారత మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్…

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎక్కువగా ట్రెండింగ్‌లో నిలిచిన పేరు శుబ్‌మన్ గిల్. నాలుగు మ్యాచుల్లో 3 సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, 851 పరుగులతో రికార్డు ఫామ్‌లో దూసుకుపోతున్నాడు…

ఈ ఏడాది ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎలా ఆడతాడా? అని టీమిండియా ఫ్యాన్స్ బోలెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు…

  ఆరు నెలలుగా పరుగుల ప్రవాహం క్రియేట్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, ఫ్యూచర్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల స్థాయికి ఎదుగుతాడనే ప్రశంసలు కూడా దక్కుతున్నాయి…

తాజాగా భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్, శుబ్‌మన్ గిల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శుబ్‌మన్ గిల్ త్వరలోనే ధోనీని ముంచేస్తాడు. ధోనీ తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నాడు…

  శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ చూస్తుంటే త్వరలోనే మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌ని డామినేట్ చేస్తాడని క్లియర్‌గా తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌కి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు…

అయితే శుబ్‌మన్ గిల్ ఇప్పటికే విరాట్ కోహ్లీపై పైచేయి సాధించి, ఆర్‌సీబీని ఓడించాడు. రోహిత్ శర్మపై తిరుగులేని ఆధిపత్యం చూపించి ముంబై ఇండియన్స్‌కి చుక్కలు చూపించాడు…

ఇక మిగిలింది ధోనీయే. అతను ఉన్న ఫామ్‌ని కొనసాగిస్తే చాలు, చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించడం కష్టమేమీ కాదు. గుజరాత్ టైటాన్స్‌కి మంచి బౌలింగ్ యూనిట్ కూడా ఉంది…

  బ్యాటింగ్‌లో డెప్త్ ఉంది, బౌలింగ్‌లో మంచి ఆప్షన్లు ఉన్నాయి. అందుకే గుజరాత్ టైటాన్స్ సక్సెస్ అవుతోంది. సీఎస్‌కేలో సీనియర్లు ఉన్నా, శుబ్‌మన్ గిల్‌కి పోటీ రాలేరు.. 

డబ్బు, ఫేమ్ అందరినీ మార్చేస్తారు. అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం చాలా ఫోకస్‌తో కనిపిస్తున్నాడు. ఓ ఐదారేళ్లు ఇలాగే ఆడితే గిల్‌ని ఆపడం ఎవరి తరం కాదు…’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్.. 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *