IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. దాంతో, ఒకవేళ వరుణుడు శాంతించకుంటే పరిస్థితి ఏంటీ? ఇరుజట్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే.. ఏమాత్రం అవకాశం ఉన్నా మ్యాచ్ ఆడిస్తారు. అలా వీలుపడనప్పుడు ఏం చేస్తారంటే..? రాత్రి 9ః35 గంటల వరకు వర్షం తగ్గితే ఓవర్లు కుదించరు. 20 ఓవర్ల ఆట కొనసాగుతుంది. అదీ సాధ్యం కాకుంటే కనీసం 5 ఓవర్లు లేదా సూపర్ ఓవర్ అయినా ఆడిస్తారు.
ఒక్క బంతి కూడా పడేందుకు చాన్స్ లేకుంటే మాత్రం రిజర్వ్ డేన అంటే.. రేపు ఫైనల్ జరుగుతుంది. రేపు కూడా వర్షం కురిసిందంటే మాత్రం పాయింట్లను చూస్తారు. 10 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. దాంతో, రెండో స్థానంలో ఉన్న సీఎస్కే రన్నరప్‌తో సరిపెట్టుకుంటుంది.
ఐపీఎల్ 2023 ట్రోఫీతో హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ
సొంత గ్రౌండ్‌లో గొప్ప రికార్డు
మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. దాంతో, పాండ్యా సేన రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా సీఎస్కే ఐదోసారి కప్పును ఎగరేసుకుపోతుందా? అనేఏ ఆసక్తి అందరిలో నెలకంది. క్వాలిఫైయర్ 1 పోరులో అనూహ్యంగా సీఎస్కే చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో పంజా విసిరింది. చాంపియన్ ఆటతో బలమైన ముంబై ఇండియన్స్‌ను 62 రన్స్‌తో చిత్తు చేసింది. సొంత గ్రౌండ్‌లో గొప్ప రికార్డు ఉన్న గుజరాత్, చెన్నైకి షాకివ్వాలనుకుంటుంది. కానీ, మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన తెలివైన వ్యూహాలతో మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పగల దిట్ట.