NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) ఆన్‌లైన్ అండ్‌ హైబ్రిడ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు. ఆన్‌లైన్ విధానంలో జులై 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.   

వివరాలు..

1) మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ ప్రోగ్రామ్ (ఎంబీఎల్‌)

కోర్సు వ్యవధి: రెండేళ్లు

2) పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌

కోర్సు వ్యవధి: ఏడాది.

విభాగాలు..

➥ హ్యూమన్‌ రైట్స్‌ లా

➥ మెడికల్ లా అండ్‌ ఎథిక్స్

➥ ఎన్విరాన్‌మెంటల్‌ లా

➥ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ లా

➥ చైల్డ్‌ రైట్స్‌ లా

➥ కన్జ్యూమర్‌ లా అండ్‌ ప్రాక్టీస్‌

➥ సైబర్ లా అండ్‌ సైబర్ ఫోరెన్సిక్స్

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.2000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 31.07.2023.

Notification

Online Application

Fee Details

Website

Also Read:

సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2023’ పరీక్షకు సంబంధించి మే 29 నుంచి జూన్ 2 వరకు నిర్వహించనున్న పరీక్షల  అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 27న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు క్యాట్ లేదా మ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్/ మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 19 వరకు అవకాశం ఉంది.

కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో న‌ర్సింగ్ క‌ళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!

పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవ‌చ్చని ఆర్టీసీ ఎండీ స‌జ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవ‌చ్చు. ఈ కళాశాల‌లో బాలిక‌ల‌కు మాత్రమే ప్రవేశం క‌ల్పించ‌నున్నారు.

పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *