మా దైవం కేసీఆర్‌

  • పింఛన్‌ పెంపుపై దివ్యాంగుల్లో వెల్లివిరిసిన సంతోషం
  • బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయంపైనా హర్షాతిరేకాలు
  • దశాబ్ది వేళ.. గ్రేటర్‌లో పండుగ వాతావరణం
  • అంబరాన్నంటిన సుపరిపాలన సంబురాలు
  • మార్మోగిన జై కేసీఆర్‌ నినాదాలు
  • పలు చోట్ల సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
  • మనసున్న మహరాజు అంటూ.. దీవెనలు
  • సిటీబ్యూరో, జూన్‌ 10(నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. జై కేసీఆర్‌.. జైజై కేసీఆర్‌ నినాదాలు నగరమంతటా మార్మోగాయి. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటే..మరోవైపు పింఛన్‌ మరో వెయ్యి రూపాయలు పెంచడాన్ని హర్షిస్తూ.. దివ్యాంగులు సంబురాలు చేసుకున్నారు. మా పాలిట దేవుడు కేసీఆర్‌ అంటూ.. కీర్తించారు. బీసీ కుల వృత్తుల వారికి ఆర్థిక సాయంపై సైతం హర్షం వ్యక్తమైంది. సంక్షేమ సారథి జయహో అంటూ..్ర గేటర్‌వ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు.

    దివ్యాంగులకు పింఛన్‌ పెంపు, కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో అవహేళనలు, వెనుకబాటుతనానికి గురైన దివ్యాంగుల పాలిట సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా మారాడు. వారి జీవితానికి గౌరవాన్ని కల్పిస్తూ రూ.3116 ఉన్న పింఛన్‌ను మరో వెయ్యి పెంచి రూ.4116 చేయడంతో దివ్యాంగులు సంబురాలు చేసుకుంటున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేని రీతిలో కృలవృత్తులకు రూ.ఆర్థిక సాయం అందజేస్తుండటంపై సబ్బండ వర్ణాలు సంబురాల్లో మునిగిపోయాయి. మానవీయ పాలనతో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఆయన చిత్రపటాలకు శనివారం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో క్షీరాభిషేకాలు చేశారు. సీఎం కేసీఆర్‌ నిండూ నూరేండ్లు సల్లంగా జీవించాలని దీవెనలు అందించారు.

    సీఎం కేసీఆర్‌కు పేదల దీవెనలు కన్నబిడ్డల్లాంటి తెలంగాణ ప్రజలకు అడక్కుండానే అన్నీ ఇస్తూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేదలందరూ దీవెనలు అందిస్తున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే ఫించన్‌ను రూ.4116కి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన దివ్యాంగుల ఆధ్వర్యంలో శనివారం సంబురాలు చేసుకున్నారు. ఫిలింనగర్‌లోని మహనీయుల చౌరస్తావద్ద దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.-

    పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌

    సీఎం కేసీఆర్‌ దివ్యాంగులకు వెయ్యి రూపాయలు పెన్షన్‌ పెంచి పేదల పక్షపాతి అని మరోసారి రుజువుచేసుకున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ పేర్కొన్నారు. శనివారం యూసుఫ్‌గూడ కూడలిలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్‌ పటేల్‌, దేదీప్య రావు, సీఎన్‌ రెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు సంజీవ, ప్రదీప్‌, అప్పూఖాన్‌, సంతోష్‌, కృష్ణమోహన్‌, నాయకులు విజయకుమార్‌, చిన్న రమేశ్‌, తన్నుఖాన్‌, నజీర్‌, విజయసింహ పాల్గొన్నారు.

    రాంనగర్‌ డివిజన్‌లో..

    దివ్యాంగుల పెన్షన్‌ పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాంనగర్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పాల్గొని సీఎం కేసీఆర్‌ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం నేత ముఠా జయసింహ,ఆ పార్టీ రాంనగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు రావులపాటి మోజస్‌, గోకా నవీన్‌, ముదిగొండ మురళి, గజ్జెల సూర్యనారాయణ, రాజుచారి, సునీల్‌, భాగ్యలక్ష్మి, మంజుల, తులసి, మహేశ్వరి, మున్నా, అమర్‌, జ్ఞానేశ్వర్‌ గౌడ్‌, శ్రవణ్‌,ప్రవీన్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఇంటికి పెద్దన్నలా నిలిచాడు

    దివ్యాంగుల పట్ల సీఎం కేసీఆర్‌ ఇంటికి పెద్దన్నలా ఆదరిస్తూ తమ పాలిట దేవుడిగా మారాడు. దివ్యాంగులని చిన్నచూపు చూసే రోజుల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటకు రెట్టింపుగా నెలకు రూ.4,116 ఇస్తానని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మునుపెన్నడూ ఊహించకుండానే తమలాంటి వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది.

    ఉమా రమా, దివ్యాంగురాలు, సూరారం

    కన్న బిడ్డలా చూసుకుంటున్నాడు

    అడగకముందే అమ్మయినా అన్నం పెట్టదు. కానీ, మా మీద దయతలిచి నేడు అడగకముందే ఈ వరాల జల్లు కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. కన్నబిడ్డలే చూసుకోని ఈ రోజుల్లో నెలనెలా ఫించన్‌ ఇస్తూ మా ఇంటి పెద్దలా నిలిచాడు. అన్నివర్గాల అభ్యున్నతికి పాడుపడుతున్న సీఎం కేసీఆర్‌కు యావత్‌ తెలంగాణ ప్రజానీకం అండగా నిలుస్తుంది.

    బీసు వెంకటేశం, భగత్‌సింగ్‌నగర్‌ మదర్‌థెరిస్సా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు

    అంబర్‌పేటలో..

    సీఎం కేసీఆర్‌ దివ్యాంగులకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.3,116 ఆసరా పింఛను మరో రూ. వెయ్యి పెంచి రూ4వేల116కు పెంచడంతో అంబర్‌ పేట నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకుడు కాలేరు మణికాంత్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఙత తెలుపుతూ కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పులిజాల గెల్వయ్య, ఆర్‌కే బాబు, రాము, లక్ష్మణ్‌, సురేశ్‌ గౌడ్‌, సాయి, సంతోష్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

    వెనుకబడ్డ కులాలు బాగుపడుతున్నాయి

    సీఎం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. గతంలో రజకులు, నాయీబ్రహ్మణులకు ఉచిత కరెంట్‌ పథకాన్ని అమలు చేసి వారి హృదయాల్లో కేసీఆర్‌ స్థానాన్ని సంపాదించుకున్నాడు. కుల వృత్తులను ప్రోత్సహించడానికి కొత్తగా రూ.లక్ష పథకాన్ని అమలు చేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత వెనుకబడ్డ కులాలన్ని బాగుపడుతున్నాయి. కుల వృత్తుల వారిని ఆదుకుంటున్న కేసీఆర్‌కు తాము రుణపడి ఉంటాం.

    పగిడిపాల రవికుమార్‌ నాయీ, కీసర

    కరెంటు చార్జీలు కట్టలేక ఇబ్బంది పడేవాళ్లం

    సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఉచిత కరెంటు ఇచ్చి, ఎంతో మేలు చేసిండు. అద్దె ఇంట్లో ఉంటూ ఇస్త్రీ చేయాలంటే పొద్దంతా కష్టపడ్డా పెద్దగా సంపాదన వచ్చేది కాదు. కరెంటు చార్జీలు కట్టలేక ఇబ్బంది పడేవాళ్లం. బతకడానికి, పిల్లలను స్కూళ్లో చదివించాలంటే పైసలు ఉండేటివి కాదు. ఉచిత కరెంట్‌ ఇవ్వడంతో ఊరిపిపీల్చుకున్నట్టయింది. అప్పులబాధల నుంచి బయటపడ్డాం. ఇప్పుడేమో రూ.లక్షల ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. ఆ డబ్బులు తమ వృత్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతాయి.

    కొలిపాక రాములు, రజక, దోబీఘాట్‌ అంబేద్కర్‌నగర్‌

    దివ్యాంగుల ఆత్మగౌరవాన్నిపెంచుతున్న సీఎం కేసీఆర్‌

    దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్‌ పెంపుతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మొదటగా దివ్యాంగులకే అందించేలా ప్రభుత్వం చూస్తున్నది. దివ్యాంగుల కుటుంబ సభ్యుల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉంటాం.

    మల్లేశ్‌, దివ్యాంగుల సమాఖ్య మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి

    కుల వృత్తులకు చేయూత

    తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు చేయూతనిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తుందని నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా ఉన్నాయి. కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, పాలకుడు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చిన తర్వాతనే కుల వృత్తుల దశ దిశ మారుతున్నది.

    చిటుకుల పవన్‌కుమార్‌ నాయీ, అలియాబాద్‌

    సీఎం అంటే కేసీఆరే

    సీఎం అంటే కేసీఆర్‌. ఇలాంటి సీఎంను ఎప్పుడు కూడా చూడలేదు. ఆయన ప్రజల కష్టాలు తెలిసిన మనిషి. నిరుపేదల ఆదుకుంటుండు. ఎంతో మంది చేసి పని మానుకొని, కంపెనీల్లో పనికి పోయిండ్రు. సీఎం కేసీఆర్‌ వచ్చినంక కుల వృత్తులకు చేసుకునే వారికి ఆసరా కల్పిస్తుండు. ఇప్పుడు కుల వృత్తులు చేసుకునే బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయం. అందరిని ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌ దేవుడు సల్లంగా సూడాలి.

    సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

    కుత్బుల్లాపూర్‌,జూన్‌10 : సీఎం కేసీఆర్‌ దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచడం పట్ల సర్వత్రాహర్షం వ్యక్తం వ్యక్తమవుతున్నది. శనివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి దివ్యాంగులు సంబురాలు చేసుకున్నారు. చింతల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో గుర్తింపు లేకుండా పోయిన తమకు సీఎం కేసీఆర్‌ హయాంలో గౌరవ ప్రదంగా సమాజంలో బతుకుతున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీశ్‌, బొడ్డు వెంకటేశ్వర్‌రావు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ తుంగ లక్ష్మారెడ్డి, ఆయా డివిజన్‌ అధ్యక్షులు శంకరయ్య, రుద్ర అశోక్‌, పోలే శ్రీకాంత్‌, మాజీ అధ్యక్షుడు గౌసుద్దీన్‌, నాయకులు సంపత్‌ మాధవరెడ్డి, మహ్మద్‌ మక్సూద్‌అలీ, గుమ్మడి మధుసూదన్‌రాజు, కస్తూరి బాల్‌రాజు, సత్తిరెడ్డి, సమ్మయ్య, తెలంగాణ సాయి, బస్వరాజ్‌, శేఖర్‌రావు, మూసాఖాన్‌, ఇందిరారెడ్డి, అరుణ, దీలిప్‌, కార్తీక్‌గౌడ్‌, శ్రీశైలంయాదవ్‌, సతీశ్‌ దివ్యాంగులు పాల్గొన్నారు.

    Posted in Uncategorized

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *